బుధవారం 20 జనవరి 2021
Food - Aug 11, 2020 , 00:06:08

తోటకూర గారెలు

తోటకూర గారెలు

కావలసిన పదార్థాలు  :

మినప్పప్పు : ఒక కప్పు

తరిగిన తోట కూర : ఒక కప్పు

తరిగిన అల్లం  : తగినంత

పచ్చిమిర్చి : 6

జీలకర్ర : ఒక స్పూన్‌

కరివేపాకు : తగినంత

ఉల్లిపాయలు : 2

నూనె : 200 గ్రాములు

తయారు చేసే విధానం :

మినప్పప్పు నాలుగు గంటలపాటు నీళ్లలో నానబెట్టి.. గారెలు వేయడానికి అనువుగా గ్రైండ్‌ చేసుకోవాలి. తోటకూర శుభ్రం చేసుకొని కడిగి సన్నగా కట్‌ చేసుకోవాలి. తరిగిన తోటకూర, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయల ముక్కలు అన్నీ ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక... పిండిని గారెల్లా వేసుకోవాలి. అంతే వేడివేడి రుచికరమైన తోటకూర గారెలు సిద్ధం. అల్లం చట్నీతో తింటే రుచికరంగా ఉంటాయి. తోటకూరలో క్యాల్షియం, ఇనుము, విటమిన్‌ సి, క్యాలరీస్‌ ఉంటాయి.


logo