గురువారం 22 అక్టోబర్ 2020
Food - Aug 05, 2020 , 23:15:02

జొన్న వడియాలు

జొన్న వడియాలు

కావలసిన పదార్థాలు :

జొన్న పిండి : 1000 గ్రా.

సగ్గు బియ్యం : 100 గ్రా.

జీలకర్ర : 25 గ్రా.

ఉప్పు : రుచికి సరిపడా

నీరు : 2.5 లీ.

అల్లం : 75 గ్రా.

పచ్చిమిర్చి : 12 గ్రా.

తయారు చేసే విధానం :

ముందుగా ఒక పాత్రలో నీటిని మరుగనివ్వాలి. దానిలో సగ్గుబియ్యం వేసి ఉడికిన తరువాత జొన్న పిండిని విడిగా, గరిటె జారుగా కలుపుకొని వేడి నీటిలో ఉండలు కాకుండా కలుపుకుంటూ పోసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కలిపి దంచిన ముద్దను ఈ మరిగే నీటిలో వేసి 15 నిమిషాలు ఉడికించిన తరువాత.. వడియాలు పెట్టుకోవాలి. తరువాత ఒక కడాయిలో నూనె పోసుకొని వడియాలు వేయించుకోవాలి.


logo