బుధవారం 30 సెప్టెంబర్ 2020
Food - Aug 04, 2020 , 00:31:01

కొర్ర పాయసం

కొర్ర పాయసం

కావలసిన పదార్థాలు :

కొర్రలు : 100 గ్రా.

బెల్లం : 150 గ్రా.

యాలకుల పొడి : 1/4 టీ స్పూన్‌

జీడి పప్పు పలుకులు : 6 

కిస్మిస్‌ : తగినంత

నెయ్యి : 5 టీ స్పూన్‌లు

పాలు : 200 మి.లీ.

నీరు : 200 మి.లీ.

తయారు చేసే విధానం : 

కడాయిలో 1 టేబుల్‌ స్పూన్‌ నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌ దోరగా వేయించాలి. అదే కడాయిలో 200 మి.లీ పాలు, 200 మి.లీ నీరు పోసి దానిలో,  నానబెట్టి ఉంచిన కొర్రలను వేసి ఉడికించాలి. ముందుగా బెల్లాన్ని తురుముకొని కొంచెం నీరు వేసి ఉడికించాలి. ఉడికిన కొర్ర బియ్యానికి బెల్లం వేసి, తర్వాత  వేయించుకొని ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్‌ కలుపుకోవాలి.

పోషకాలు (100 గ్రాముల పదార్థంలో) :

ప్రొటీన్స్‌ : 8.70 గ్రా., కొవ్వు : 5.2 గ్రా.

పీచు పదార్థం : 2.3 గ్రా., 

పిండి పదార్థం : 40.0 గ్రా.

శక్తి : 301.0 కి.క్యాలరీస్‌, 

క్యాల్షియం : 73.0 మి.గ్రా.

ఇనుము : 1.2 మి.గ్రా.

తాజావార్తలు


logo