బుధవారం 05 ఆగస్టు 2020
Food - Jul 31, 2020 , 23:56:29

అటుకుల పాయసం

అటుకుల పాయసం

కావలసిన పదార్థాలు :

జొన్న పిండి : 250 గ్రా., పాలు : 150 గ్రా., 

యాలకుల పొడి : 7 గ్రా., నెయ్యి : 100 గ్రా., 

జీడిపప్పు : అవసరమైతే, బెల్లం : 150 గ్రా., 

అటుకులు : మూడు కప్పులు

తయారు చేసే విధానం :

ఒక కడాయిలో కొంచెం నెయ్యి పోసి అటుకులను రెండు నిమిషాల పాటు వేయించాలి. ఒక కప్పు అటుకులకు 3 కప్పుల నీళ్లు తీసుకొని వేడి చేయాలి. కాగిన నీళ్లలో వేయించిన అటుకులు వేసి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. దీనికి పాలుపోసి మరొక 10 నిమిషాలు ఉడకనిచ్చి చివరిగా తురిమిన బెల్లం వేసి కలియబెట్టాలి. యాలకుల పొడి వేయాలి. జీడిపప్పు, నెయ్యితో అలంకరించాలి.

పోషక విలువలు (100 గ్రా.లో) :

ప్రొటీన్స్‌ : 6.9 గ్రా., కొవ్వు : 4.3 గ్రా., పీచు 

పదార్థం : 0.9 గ్రా., పిండి పదార్థం : 58.12 గ్రా., శక్తి : 304.82 కి.క్యాలరీస్‌, క్యాల్షియం : 89.3 మి.గ్రా., ఇనుము : 2.6 మి.గ్రా.


logo