గురువారం 13 ఆగస్టు 2020
Food - Jul 29, 2020 , 23:13:53

జొన్న బర్ఫీ

జొన్న బర్ఫీ

కావలసిన పదార్థాలు

జొన్న పిండి - 200 గ్రా., పంచదార - 100 గ్రా., యాలకుల పొడి - 10 గ్రా., నెయ్యి - 30 గ్రా. జీడిపప్పు - అలంకరించుకోవడానికి.

తయారు చేసే విధానం

ఒక కడాయిలో కొంచెం నెయ్యి పోసి పిండిని వేయించాలి. పంచదార తీగపాకం వచ్చిన తరువాత వేయించుకొన్న పిండిని పోస్తూ.. ఉండలు లేకుండా కలుపుతూ.. పది నిమిషాలు ఉడకనివ్వాలి. మిగిలిన నెయ్యిని, యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులో పోసి కావలసిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి. చివర్లో, జీడిపప్పుతో అలంకరించుకోవాలి. 

పోషక విలువలు (100 గ్రాముల పదార్థంలో)

ప్రొటీన్స్‌ - 91 గ్రా., కొవ్వు - 10.4 గ్రా., 

పీచు పదార్థం - 9.05 గ్రా., పిండి పదార్థం -73.17 గ్రా., శక్తి - 402.6 కి.క్యాలరీస్‌, క్యాల్షియం - 22.05 మి.గ్రా., ఇనుము - 2.58 మి.గ్రా.


logo