శనివారం 08 ఆగస్టు 2020
Food - Jul 28, 2020 , 23:22:59

సజ్జ వాంగీబాత్‌

సజ్జ వాంగీబాత్‌

కావలసిన పదార్థాలు

సజ్జరవ్వ - 150 గ్రా.

వంకాయలు - 70 గ్రా.

ఉల్లిపాయలు - 15 గ్రా.

పచ్చిమిర్చి - 15 గ్రా.

పసుపు -2 గ్రా.

యాలకులు - 5 గ్రా.

చెక్క - 5 గ్రా.

జీలకర్ర - 5 గ్రా.

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - 10 గ్రా.

అల్లం వెల్లుల్లి ముద్ద - 10 గ్రా.

తయారు చేసే విధానం

కడాయిలో కొంచెం నెయ్యిపోసి రవ్వను దోరగా వేగనివ్వాలి. అదే పాత్రలో నూనె వేసి యాలకులు, చెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, తురిమిన అల్లం, వంకాయలు వేసి వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి ముద్దను వేసి కాసేపు మూత పెట్టి ఉంచాలి. ముందుగా 4 కప్పుల నీళ్లు పోసి రుచికి తగినంత ఉప్పు, రవ్వ వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి.

పోషకాలు (100 గ్రాముల పదార్థంలో)

ప్రొటీన్స్‌ - 6.8 గ్రా., కొవ్వు - 4.5 గ్రా.

పీచు పదార్థం - 1.3 గ్రా., పిండి పదార్థం - 38.1 గ్రా.

శక్తి -207.8 కి.క్యాలరీస్‌, క్యాల్షియం - 35.6 మి.గ్రా.

ఇనుము - 5.0 మి.గ్రా.


logo