మంగళవారం 26 జనవరి 2021
Food - Jul 21, 2020 , 23:41:40

సజ్జ మిఠాయి

సజ్జ మిఠాయి

కావలసిన పదార్థాలు :

సజ్జ పిండి : 250 గ్రా; శనగ పిండి : 30 గ్రా.

బెల్లం : 250 గ్రా; యాలకుల పొడి : 10 గ్రా.

నూనె : తగినంత; నెయ్యి : 5 గ్రా.

తయారు చేసే విధానం :

సజ్జ పిండిలో శనగపిండిని కలపాలి. ఈ మిశ్రమంలో నీరు పోసి గరిటె జారుగా కలపాలి. కడాయిలో నూనె పోసి కాగిన తరువాత బూందీ చట్రంపై కలిపిన పిండిని పోస్తూ బూందీ తయారు చేసుకోవాలి. విడిగా బెల్లాన్ని ఉండపాకం రానిచ్చి అందులో యాలకుల పొడి, బూందీ వేసి కలపాలి. తరువాత ఒక ప్లేటుమీద నెయ్యి రాసి కలిపిన బూందీని అచ్చులా పరిచి చల్లారిన తరువాత డబ్బాలో భద్రపరుచుకోవాలి.

పోషక విలువలు (100 గ్రాముల పదార్థంలో) :

ప్రొటీన్స్‌ : 10.2 గ్రా; కొవ్వు :  2.7 గ్రా; పీచు పదార్థం : 0.99 గ్రా; పిండి పదార్థం : 79.33 గ్రా;శక్తి : 369.35 కి.క్యాలరీస్‌, క్యాల్షియం : 62.0 మి.గ్రా; ఇనుము : 5.1 మి.గ్రా.


logo