బుధవారం 27 జనవరి 2021
Food - Jul 18, 2020 , 00:46:42

సజ్జ బాదుషా

సజ్జ బాదుషా

కావలసిన పదార్థాలు :

సజ్జ పిండి : 250 గ్రా.

నెయ్యి : 25 గ్రా.

బియ్యం పిండి : 50 గ్రా.

మైదా : 50 గ్రా.

యాలకుల పొడి : 10 గ్రా.

నూనె : తగినంత 

బెల్లం : 200 గ్రా.

నీళ్ళు : 200 మి.లీ.

తయారు చేసే విధానం :

సజ్జ పిండి, బియ్యం పిండి జల్లించుకొని, వేడి చేసిన నెయ్యి కలుపుకోవాలి. దీనిని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పంచదార పాకంలో యాలకుల పొడిని చేర్చి తీగపాకం వచ్చేదాకా ఉంచాలి. పక్కన పెట్టిన ముద్దను ఉండలుగా చేసి.. మూడు చపాతీల్లా బియ్యం పిండిని చేర్చి చేసుకోవాలి. చపాతీలను ఒకదానిపై ఒకటి పరచి, మడిచి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. దీన్ని కాగిన నూనెలో వేయాలి. తర్వాత తీగ పాకంలో వేసి తీయాలి.

పోషకాలు (100 గ్రా. లో) :

ప్రొటీన్స్‌ : 8.35 గ్రా.

కొవ్వు : 6.60 గ్రా.

పీచు పదార్థం : 0.8 గ్రా.

పిండి పదార్థం : 75.03 గ్రా.

శక్తి :  386.82 కి.క్యాలరీస్‌

క్యాల్షియం : 50.34 మి. గ్రా.

ఇనుము : 4.69 మి.గ్రా.logo