మంగళవారం 11 ఆగస్టు 2020
Food - Jul 11, 2020 , 00:03:32

జొన్న ఉప్మా

జొన్న ఉప్మా

కావలసిన పదార్థాలు :

జొన్న రవ్వ : 100 గ్రా. 

వేరుశనగ పప్పు : 25 గ్రా.

పచ్చి శనగపప్పు : 7 గ్రా.

ఆవాలు : 5 గ్రా.

జీలకర్ర : 8 గ్రా.

కరివేపాకు : 5 గ్రా.

ఉప్పు : రుచికి సరిపడా

నూనె : 20 గ్రా.

ఉల్లిపాయలు : 20 గ్రా.

పచ్చిమిర్చి : 5 గ్రా.

నీళ్లు : 4 కప్పులు

పోషకాలు (100 గ్రాముల పదార్థంలో):

ప్రొటీన్స్‌ : 10.83 గ్రా.

కొవ్వు : 17.6 గ్రా.

పీచు పదార్థం : 2.1 గ్రా.

పిండి పదార్థం : 45.04 గ్రా.

శక్తి : 383.92 కి.క్యాలరీస్‌

క్యాల్షియం : 95.25 మి.గ్రా

ఇనుము : 3.1 మి.గ్రా.

తయారు చేసే విధానం :

గిన్నెలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె పోసి రవ్వను 2 నిమిషాలు దోరగా వేయించి పక్కన పెట్టాలి. అదే గిన్నెలో మిగిలిన నూనె వేసి తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 5 ని. వేగనివ్వాలి. రుచికి తగినంత ఉప్పు వేసి 4 కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్ళలో రవ్వ వేసి సన్నని సెగపై 5-10 ని. ఉడకబెట్టాలి.


logo