గురువారం 13 ఆగస్టు 2020
Food - Jul 04, 2020 , 00:49:06

సజ్జ స్వీట్‌ పూరి

సజ్జ స్వీట్‌ పూరి

కావలసిన పదార్థాలు :

సజ్జ పిండి : 200 గ్రా.

మైదా : 25 గ్రా.

బేకింగ్‌ సోడా :  చిటికెడు

ఉప్పు : చిటికెడు

బెల్లం లేదా పంచదార : 100 గ్రా.

నూనె : వేయించడానికి సరిపడా

నీళ్ళు : 100 మి.లీ.

తయారీ విధానం :

మైదా, సజ్జ పిండి రెండూ జల్లించి కలపాలి. పిండిలో రుచికి కొద్దిగా ఉప్పు, బెల్లం, నీళ్ళు పోసి  పూరీ పిండిలా కలుపుకోవాలి. పిండి ముద్దను తీసుకొని పూరీలా ఒత్తి కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి.

పోషకాలు (100 గ్రా.లో):

ప్రొటీన్స్‌ : 8.10 గ్రా.

కొవ్వు : 3.17 గ్రా.

పీచు పదార్థం : 0.76 గ్రా.

పిండి పదార్థం : 76.45 గ్రా.

శక్తి : 366.7 కి.క్యాలరీలు

క్యాల్షియం : 52.23 మి.గ్రా.


logo