శనివారం 04 జూలై 2020
Food - Jul 01, 2020 , 00:07:15

సజ్జ అప్పాలు

సజ్జ అప్పాలు

కావలసిన పదార్థాలు :

సజ్జ పిండి : 150 గ్రా.

మైదా : 25 గ్రా.

ఉప్పు : రుచికి సరిపడా

నూనె :  వేయించడానికి సరిపడా

బెల్లం : 50 గ్రా.

నీళ్ళు : 100 మి.లీ.

తయారీ విధానం :

మైదా, సజ్జ పిండి రెండూ జల్లించి కలపాలి. బెల్లాన్ని తురుముకొని పెట్టుకోవాలి. పిండిలో బెల్లం తురుము, బేకింగ్‌ సోడా, ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి గరిటె జారుగా కలపాలి. 20 నిమిషాలు పక్కన ఉంచాలి. కాగుతున్న నూనెలో ఒక గరిటె పిండి పోసి రెండు వైపులా వేయించుకోవాలి.

పోషక విలువలు (100 గ్రాముల పదార్థంలో) :

ప్రొటీన్స్‌ : 11.5 గ్రా.

కొవ్వు : 4.41 గ్రా.

పీచు పదార్థం : 1.06 గ్రా.

పిండి పదార్థం : 68.41 గ్రా.

శక్తి : 359.14 కి.క్యాలరీలు

క్యాల్షియం : 39.2 మి.గ్రా

ఇనుము : 7.24 మి.గ్రా.


logo