మంగళవారం 14 జూలై 2020
Food - Jun 28, 2020 , 23:28:27

మిక్స్‌డ్‌ అటుకుల లడ్డూ

మిక్స్‌డ్‌ అటుకుల లడ్డూ

కావలసిన పదార్థాలు:

రాగి పిండి : 200 గ్రా., అటుకులు : 100 గ్రా., 

నెయ్యి : 75 గ్రా., యాలకుల పొడి : 10 గ్రా., 

బెల్లం : 125 గ్రా., వేరుశనగపప్పు : 100 గ్రా.

తయారీ విధానం :

ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసి పిండిని వేయించుకోవాలి. తరువాత వేరుశనగ పప్పును వేయించుకొని పొడి చేసుకోవాలి. తురిమిన బెల్లం, ఎండు

కొబ్బరి, యాలకుల పొడులను పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. మిగిలిన నెయ్యిని వేడి చేసి పిండిలో పోసి లడ్డూలు చేసుకోవాలి. 


పోషక విలువలు 

(100 గ్రాముల పదార్థంలో):

ప్రొటీన్స్‌ : 4.26 గ్రా.

కొవ్వు : 14.79 గ్రా.

పీచు పదార్థం : 1.85 గ్రా.

పిండి పదార్థం : 174.60 గ్రా.

శక్తి : 425.10 కి.క్యాలరీస్‌

క్యాల్షియం : 157.19 మి. గ్రా.

ఇనుము : 6.02 మి.గ్రా.


logo