ఆదివారం 17 జనవరి 2021
Food - Jun 24, 2020 , 00:24:39

రాగి వడ

రాగి వడ

పోషక విలువలు ( 100 గ్రాముల పదార్థంలో) :

ప్రొటీన్లు : 4.23 గ్రా. 

కొవ్వు : 54.41 గ్రా. 

పీచు పదార్థం : 1.4 గ్రా.

పిండి పదార్థం : 23.37 గ్రా., 

శక్తి : 597.92 కి.కాలరీస్‌

క్యాల్షియం : 96.85 మి.గ్రా

ఇనుము : 0.79 మి.గ్రా.

కావలసిన పదార్థాలు :

రాగి పిండి : 80 గ్రా, నానపెట్టిన శనగలు: 35 గ్రా., కారం పొడి : 5గ్రా., ఉప్పు : రుచికి సరిపడా, ఉల్లిపాయలు : 10 గ్రా.,

పచ్చిమిర్చి : 5 గ్రా., అల్లం : 10 గ్రా., గరం మసాల పొడి : చిటికెడు, కరివేపాకు : 5 గ్రా., కొత్తిమీర : 5 గ్రా., పుదీనా : 10 గ్రా., జీలకర్ర : 5 గ్రా., నూనె : 200 గ్రా.

తయారీ విధానం :

నానబెట్టిన శనగపప్పును మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీన సన్నగా తరిగి ఉంచుకోవాలి. పిండిలో తరిగిన ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు వేసి కలిపి ఉంచుకోవాలి. కడాయిలో నూనె వేసి కాగిన తరువాత పిండిని కొంచెం తీసుకొని వడల్లాగా వత్తి నూనెలో ఎర్రగా వేయించాలి.