గురువారం 02 జూలై 2020
Food - Jun 22, 2020 , 01:49:58

మిక్స్‌డ్‌ వెజ్‌ కర్రీ

మిక్స్‌డ్‌ వెజ్‌ కర్రీ

కావలసిన పదార్థాలు :ఉల్లిపాయ  : 1

నూనె లేదా నెయ్యి : 3 టేబుల్‌ స్పూన్లు

లవంగాలు : 3

వెల్లుల్లి ముక్కలు: కొన్ని 

అల్లంపేస్ట్‌ : 1 టేబుల్‌ స్పూన్‌

పసుపు : 1 టీస్పూన్‌

కరివేపాకు :1టీస్పూన్‌

దాల్చిన చెక్క : 1 టీస్పూన్‌

ఉప్పు : 1 టీస్పూన్‌

మిరియాలు : 1/4 టీస్పూన్‌

కారం : 1/2 టీస్పూన్‌

టమాట పేస్ట్‌ : 1 టేబుల్‌ స్పూన్‌

చిలగడదుంప : 1

ఎర్రని క్యాప్సికం : 2

క్యారెట్‌ : 2

గుమ్మడికాయ : 1 ముక్క

పచ్చి బఠానీలు : 2 కప్పులు

తగినంత నీరు లేదా కొబ్బరిపాలు

బచ్చలి ఆకులు : 2 కప్పులు

తయారీ విధానం :పెద్ద పాన్‌లో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి. పచ్చిమిర్చి, అల్లం వేసి మరో నిమిషం పాటు ఉడికించాలి. తర్వాత మసాలా దినుసులు పసుపు, కరివేపాకు, దాల్చిన చెక్క, ఉప్పు, మిరియాలు, కారం, టమాట పేస్టు వేసి మరో నిమిషం ఉడికించాలి. తరిగిన బంగాళాదుంప, క్యాప్సికం, క్యారెట్‌, గుమ్మడికాయ ముక్కలను జోడించి కొన్ని నిమిషాల పాటు మంట తగ్గించి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత అందులో  బచ్చలి ఆకు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. అవసరమైతే కూరలో కొబ్బరిపాలు కూడా కలుపుకోవచ్చు. అన్నంతో లేదా రొట్టెతో తింటే బాగుంటుంది.

లాభాలు : కూరగాయల్లో ఎ, సి, కె, బి విటమిన్లు, పొటాషియం, మాంగనీస్‌ పుష్కలంగా లభిస్తాయి. వెల్లుల్లి, అల్లం, పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు  రోగనిరోధక శక్తిని పెంచుతాయి.


logo