మంగళవారం 07 జూలై 2020
Food - Mar 17, 2020 , 22:47:26

ఇడ్లీలు వేరుగా..

ఇడ్లీలు వేరుగా..

ఇడ్లీలు గుండ్రంగానే ఎందుకుండాలి? ఇలా ఎప్పుడైనా అనిపించిందా! ఇడ్లీలంటేనే బోరింగ్‌ అనుకునే కొందరు పిల్లలు, పెద్దలున్నారు. మరి వారికి ఒకేలాంటి ఇడ్లీలు పెడితే ఏం తింటారు చెప్పండి. పైగా కరోనా కారణంగా పెద్దలకు, పిల్లలకు హాలీడేస్‌ వచ్చేశాయి. వారికి సుతిమెత్తని ఇడ్లీలను సరికొత్తగా పెట్టాలని భావించే వారికే ఈ ఇడ్లీ ప్లేట్లు. ఒక్కో షేప్‌తో వచ్చిన ఇడ్లీ స్టాండ్లు ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో ప్రముఖ కంపెనీలు వీటిని తయారుచేస్తున్నాయి. దీని ధర కూడా 545 రూపాయలు మాత్రమే. దీంతో.. ఈ స్టాండ్‌ ఆన్‌లైన్‌ మార్కెట్‌లో హాట్‌గా అమ్ముడుపోతున్నదట.


logo