మంగళవారం 07 జూలై 2020
Food - Mar 16, 2020 , 23:06:14

చెక్కు తీసేస్తుంది

చెక్కు తీసేస్తుంది

కూరగాయల పొట్టు తీసేయాలన్నా.. ఆలూ, ఆపిల్‌ చెక్కు తీయాలన్నా చాలా పెద్ద పనే. దానికే ఎక్కువ సమయం పోతుంది కూడా. అలాకాకుండా చటుక్కున ఆ పని జరిగిపోతే ఎంత హాయో అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. అలాంటివారికోసమే దీన్ని తయారుచేశారు. కూరగాయ సైజును బట్టి పైన పిన్‌ని ఫిక్స్‌ చేసుకోవచ్చు. కింద ఉన్న పిన్‌ మాత్రం కదులదు. ఈ రెండింటి మధ్య కూరగాయలు, పండ్లను పెట్టి ఒక బటన్‌ నొక్కితే చాలు.. 10 సెకన్లలో పొట్టు వచ్చేస్తుంది. స్టయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారైన ఈ పరికరం పై చెక్కును మాత్రమే తీసేస్తుంది. అందులో న్యూట్రిషియన్స్‌ పోయేలా మాత్రం చెక్కు తీయదు. బ్యాటరీతోనే కాదు.. ఆడప్టర్‌తో పనిచేసే పీలర్స్‌ కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. వీటి ధర సుమారు 1500 రూపాయల వరకు ఉంది. పని అంత సులువు అయినప్పుడు ఈ మాత్రం ఖర్చు చేయడంలో తప్పులేదేమో! logo