మంగళవారం 07 జూలై 2020
Food - Mar 08, 2020 , 22:56:15

వేసవిలో పుచ్చకాయ్‌..ఎంతో హాయ్‌

వేసవిలో పుచ్చకాయ్‌..ఎంతో హాయ్‌

వేసివిలో దొరికే పుచ్చకాయ తింటే కడుపు చల్లగా ఉండటమే కాదు. అందం రెట్టింపు అవుతుంది. పుచ్చకాయతో పొందే ఆరోగ్యం, కలిగే అందం గురించి తెలుసుకోవాలంటే ఈ కింది చిట్కాలు పాటించాలి.

అందం 

  • వేసవిలో చర్మం ఎంతో పొడిబారిపోయినట్టుగా మారిపోతుంది. మందంగా తయరై చర్మం కాలిపోతున్నట్టుగా ఉంటుంది. వీటికి చెక్‌ పెట్టాలనుకుంటే పుచ్చకాయతో ఫేస్‌మాస్క్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయి.
  • ఇందులోని 90 శాతం నీరు చర్మాన్ని తేమగా ఉంచేందుకు తోడ్పడుతుంది. 
  • పుచ్చకాయ రసం, కీర గుజ్జును సమపాళ్లలో కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి. ఇక అంతే.. చర్మం నిగారించడమే కాకుండా చర్మాన్ని కాపాడుతుంది.


ఆరోగ్యం 

  • డయాబెటిస్‌ ఉన్నవారు నిత్యం పుచ్చకాయ విత్తనాలు తింటుంటే.. షుగర్‌ అదుపులో ఉంటుంది.  
  • హైబీపీ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలు తింటే బీపీ తగ్గుతుంది. బీపీ అదుపులోకి వస్తుంది.
  • పుచ్చకాయ విత్తనాలను రోజూ తినడం వల్ల కండరాలు దృఢంగా మారతాయి.  
  • మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాలను రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • కంటిచూపును మెరుగుపరిచే అద్భుతమైన ఔషధ గుణాలు పుచ్చకాయ విత్తనాల్లో ఉంటాయని, విత్తనాలు నిత్యం తింటుంటే.. నేత్ర సమస్యలు పోతాయని సైంటిస్టులు చెబుతున్నారు.
  • పుచ్చకాయ తినడం వల్ల అంగస్తంభన సమస్యలు రావని పరిశోధనలు చెబుతున్నాయి. పుచ్చకాయలోని సిట్రులైన్‌, ఆర్గినైన్‌ పదార్థాల వల్ల ఇది సాధ్యపడుతుంది. ఇవి నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. 


logo