బుధవారం 08 జూలై 2020
Food - Mar 08, 2020 , 22:54:32

ఆరోగ్యానికి ఐదు చిట్కాలు

ఆరోగ్యానికి ఐదు చిట్కాలు

చాలామంది ఆరోగ్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో ఆహార పదార్థాలు తీసుకుంటుంటారు. అయినప్పటికీ తరచూ జబ్బుబారిన పడుతూనే ఉంటారు. ఈ ఐదు చిట్కాలు పాటిస్తే అనారోగ్యాల్ని దూరం చేసుకోవచ్చు.

  • దగ్గినా, తుమ్మినా చేతుల్ని అడ్డు పెట్టుకుంటాం. ఆ తర్వాత చేతుల్ని తుడిచేసుకుంటే సరిపోదు. అలా అడ్డుపెట్టుకున్న ప్రతిసారీ సబ్బునీటితో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.
  • ఒక స్పూన్‌ కొత్తిమీర రసానికి ఒక కప్పు మజ్జిగ చేర్చి తాగితే అజీర్ణం, వాంతులు, వెక్కిళ్లు వంటి సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల పళ్లు, చిగుళ్లు కూడా బలంగా తయారవుతాయి.
  • క్రిములు చేతులపైనే కాదు.. నోట్లోనూ ఉంటాయి. అందుకని రోజూ రెండు సార్లు ఫ్లోరైడ్‌ ఉన్న టూత్‌ పేస్టుతో పళ్లు తోముకోవాలి. నాణ్యమైన టూత్‌బ్రష్‌ను మాత్రమే వాడాలి.
  • స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నవారు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక స్పూన్‌ తేనె తీసుకుంటే మంచిది.
  • ఎక్కువగా కూర్చొని పనిచేసేవారు కనీసం రోజుకో అరటిపండు అయినా తీసుకోవాలి. తాజా కూరగాయల్ని రోజూ వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.


logo