శుక్రవారం 10 జూలై 2020
Food - Mar 06, 2020 , 23:17:00

ఖర్జూరాతో తక్షణ శక్తి

ఖర్జూరాతో తక్షణ శక్తి

ఖర్జూరం శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ఒకటి. ఇందులో అనేక పోషకాలున్నాయి. నీరసం రాకుండా ఉండేందుకు చాలామంది ఉపవాసం ఉన్న సమయాల్లో ఈ పండ్లను ఎక్కువగా తింటుంటారు. ఇందులోని పోషకాలు, తింటే లాభాలు ఇవీ.

  • ఇందులో విటమిన్‌ ఎ, బిలతో పాటు క్యాల్షియం, ఐరన్‌, పాస్పరస్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉన్నాయి. రోజూ రెండు ఖర్జూర పండ్లు తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి.
  • గుండె నీరసం ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్నిస్తుంది. ఇందులో గ్లూకోజ్‌, ఫక్టోజ్‌ అధికం. ఈ పండ్లు తిన్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణమే శక్తిని అందిస్తాయి. ఖర్జూరం గుజ్జును పాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మంచిది.
  • ఖర్జూరంలో ఉండే ఫైబర్‌ మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తిని కలిగి ఉంటుంది. మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో నాలుగైదు ఎండు ఖర్జూరాలను నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని బాగా పిండి ఆనీటిని తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య తగ్గుతుంది.
  • ఒక చిన్న జార్‌లో మూడు వంతుల తేనె తీసుకోవాలి. గింజలను తీసిన ఎండు ఖర్జూరా పండ్లను వేయాలి. ఆ జార్‌ను బాగా షేక్‌ చేసి వారం రోజుల పాటు పక్కనపెట్టి ఉంచాలి. వారం తర్వాత రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినాలి. ఇలా చేస్తే దగ్గు, జలుబు, జ్వరం వంటివి తగ్గుతాయి.



logo