ఆదివారం 05 జూలై 2020
Food - Mar 05, 2020 , 22:42:24

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం

కేరళలో కరోనా వచ్చిన వారికి డాక్టర్లు మందులతో పాటు కొన్ని పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్ని ఇచ్చారు. ఫలితంగా వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అది వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం. అలాంటి ఆహారం ఏంటంటే?

  • టమాటా, బొప్పాయి, నారింజ, జామకాయి, యాపిల్‌, కమలం, బత్తాయి, ఉసిరి, నిమ్మకాయ, ద్రాక్ష, కివి, పైనాపిల్‌, స్ట్రాబెర్రీ, మామిడి, చెర్రీపండ్లలో సి విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లలో ఏదో ఒకటి రోజూ తినడం మంచిది. 
  • టమాటాలు రోజూ వాడుతుంటాం. కాకపోతే వాటిని కూరలో ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి సి విటమిన్‌ బాడీకి చేరదు. కూరతో పాటుగా ఖాళీ సమయాల్లో టమాటాలను తింటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
  • ఏ పండ్లలో సి విటమిన్‌ ఉంటుందా? అని లోతుగా ఆలోచించాల్సిన పనిలేదు. పుల్లగా ఉండే అన్ని పండ్లలో సి విటమిన్‌ ఉంటుంది.
  • కూరగాయల్లో బ్రకోలీలో ఎక్కువగా సి విటమిన్‌ ఉంటుంది. అలాగే పచ్చి మిర్చి, పాలకూర, కాలీఫ్లవర్‌, ఆవాలు, బంగాళాదుంప ఇవి రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకుంటే బాడీకి సి విటమిన్‌ సరిపడా అందుతుంది.logo