మంగళవారం 02 జూన్ 2020
Food - Mar 01, 2020 , 23:10:54

గేగులు తింటే పేగులు శుభ్రం

గేగులు తింటే పేగులు శుభ్రం

  • గేగుల్లోని పీచు జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తరచూ గేగుల్ని తీసుకునేవారికి పెద్ద పేగుల్లో మలినాలు దరిచేరవు. 
  • గేగులు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో పీచు, క్యాల్షియం, ఫాస్పరస్‌, ఒమెగా-3 పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, విటమిన్‌ బి, బి1, బి3, సి వంటివి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. 
  • ఇందులోని క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. ఫాస్పరస్‌ శరీరానికి దృఢత్వాన్నిస్తుంది.
  • వీటిని పాలల్లో ఉడికించి ఆ మిశ్రమాన్ని చర్మానికి పూతలా వేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. 
  • రోజుకు రెండు గేగులు తీసుకుంటే శరీరంలోని కొవ్వుసైతం కరిగిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
  • వేసవిలో గేగులు తినడం వల్ల చెమటకాయలు రావు. 
  • గేగుల్ని బాగా నమలితింటే నోటి పూత తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.


logo