మంగళవారం 07 జూలై 2020
Food - Feb 26, 2020 , 23:02:51

పాలు పగలవిక!

పాలు పగలవిక!

  • చల్లబడిన చపాతీలపై కొద్దిగా నీళ్లు చల్లి మళ్లీ వేడిచేస్తే మెత్తగా మారుతాయి. 
  • కుక్కర్‌ అడుగున పేరుకుపోయినట్లు ఉంటే వంట చేసేముందు ఒక నిమ్మచెక్క కుక్కర్‌లో వేసి ఉడికిస్తే సరి.
  • ఇడ్లీ పాత్రలు నల్లబడితే డిటర్జెంట్‌ పౌడర్‌, వెనిగర్‌ కలిపి వాడేసిన టూత్‌బ్రష్‌తో తోమితే ఇడ్లీ పాత్రలు మెరుస్తాయి.
  • పాలను కాచేముందు పాలల్లో కొద్దిగా ఇలాయిచీ పొడి వేసి కాస్తే పాలు విరగవు.
  • గారెలు మృదువుగా రావడానికి మినుపపప్పులో చారెడు పచ్చ పెసలు కలిపి రుబ్బితే గారెలు మృదువుగా వస్తాయి.
  • ఏదైనా కూరలో లేదా చట్నీలో కారం ఎక్కువైతే కాస్తంత నిమ్మ రసం పిండితే సరి.
  • పరుపులు, సోఫా స్పాంజీల కింద వేపఆకులు, తులసి ఆకులు పెట్టి ఉంచితే క్రిమికీటకాలు, బ్యాక్టీరియా చేరవు.
  • చెవిలో చీమ, లేదా పురుగు చొరబడితే త్వరగా బయటకు రావాలంటే టార్చిలైటు ఆన్‌ చేసి చెవిలోపలివైపు చూపాలి. క్షణాల్లోనే బయటికివస్తాయి.


logo