మంగళవారం 07 జూలై 2020
Food - Feb 23, 2020 , 23:16:31

కాఫీ మరింత రుచిగా..

కాఫీ మరింత రుచిగా..

  • కాఫీ మరింత రుచిగా ఉండాలంటే డికాషన్‌లో చిటికెడు ఉప్పువేయాలి.
  • పకోడి చేసేటప్పుడు కొంచెం బియ్యంపిండి కలిపితే పకోడీలు కరకరలాడుతాయి.
  • ఉల్లిపాయలు తరిగే ముందు వాటిని నీళ్లలో ముంచి తరిగితే కళ్లలో నీళ్లు రావు.
  • నెయ్యి తాజాగా ఉండాలంటే వెన్న కాసేటప్పుడు గిన్నెలో ఓ తమలపాకు వేసి ఉంచాలి.
  • బాదాంను పావుగంట పాటు వేడి నీళ్లలో నానబెడితే పొట్టు త్వరగా వస్తుంది.
  • ఆపిల్‌ ముక్కల మీద నిమ్మరసం రాస్తే ముక్కలు రంగు మారకుండా ఉంటాయి.
  • నూనె వేడెక్కగానే పసుపు వేస్తే కూరగాయల రంగు మారకుండా ఉంటుంది.
  • ఆకు కూరలు ఉడికించిన నీటిని సూప్‌ల తయారీలో వాడొచ్చు.
  • మజ్జిగతో కడిగితే ప్లాస్క్‌లు దుర్వాసన రాకుండా ఉంటాయి.


logo