శుక్రవారం 10 జూలై 2020
Food - Jan 08, 2020 , 16:54:30

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌ర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌ర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

అధిక బ‌రువు, బాన‌పొట్ట స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా ? అయితే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించేందుకు ప్రోటీన్లు ఉన్న ఆహారాల‌ను తీసుకోవాల‌ని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే కొవ్వును క‌రిగించ‌డంలో ప్రోటీన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. అలాగే కండ‌రాలు నిర్మాణ‌మ‌వుతాయి. ప్రోటీన్లు ఉన్న ఆహారాల‌ను నిత్యం త‌గిన మోతాదులో తీసుకుంటే శ‌రీరం ఆహారాన్ని జీర్ణం చేసేందుకు అధికంగా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తుంది. దీని వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు సుల‌భంగా క‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే ఏయే ప్రోటీన్ ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును కరిగించ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.


1. కోడిగుడ్లు


ప్రోటీన్లు స‌మృద్ధిగా ల‌భించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఆక‌లిని నియంత్రిస్తాయి. కండ‌రాల నిర్మాణానానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. నిత్యం ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్ల‌ను తీసుకుంటే చ‌క్క‌ని ఫ‌లితాలు ఉంటాయి.

2. చేప‌లు


చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి కండ‌రాల నిర్మాణానికి ఉపయోగ‌ప‌డ‌తాయి. శ‌రీరంలో వాపుల‌ను త‌గ్గిస్తాయి. దీని వ‌ల్ల మెట‌బాలిక్ రేటు పెరుగుతుంది. అలాగే అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు.

3. బీన్స్


చిక్కుడు జాతికి చెందిన సోయా బీన్స్‌, ప‌చ్చి బ‌ఠానీలు త‌దిత‌ర ఆహారాల‌ను నిత్యం తీసుకున్నా పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగా క‌రిగించుకోవ‌చ్చు. వీటిల్లో ఉండే ప్రోటీన్లు, ఫైబ‌ర్ అధిక బ‌రువును త‌గ్గిస్తాయి.

4. పాలు, పాల సంబంధ ప‌దార్థాలు


పాల‌ల్లోనూ మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు పుష్క‌లంగా ఉంటాయి. పాలు, పాల సంబంధ ప‌దార్థాలను నిత్యం తీసుకున్నా కొవ్వు క‌రిగించుకోవ‌చ్చు.

5. బాదం ప‌ప్పు


వీటిల్లో మ‌న శరీరానికి పనికొచ్చే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఎక్కువ సేపు తిన‌కుండా ఉన్నా ఆక‌లి కాకుండా చూస్తాయి. ఆక‌లిని నియంత్రిస్తాయి. దీని వ‌ల్ల ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గుతారు.


logo