శుక్రవారం 10 జూలై 2020
Food - Jan 08, 2020 , 16:53:06

ఆర్థ‌రైటిస్ త‌గ్గాలంటే.. ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

ఆర్థ‌రైటిస్ త‌గ్గాలంటే.. ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

కీళ్లు వాపుల‌కు గురై బాగా నొప్పి ఉంటే.. అలాంటి స్థితిని ఆర్థ‌రైటిస్ అంటారు. వ‌య‌స్సు మీద ప‌డిన వారికే ఈ వ్యాధి ఎక్కువ‌గా వ‌స్తుంటుంది. కీళ్ల‌లో ఏర్ప‌డే వాపులు నొప్పికి దారి తీస్తాయి. దీంతో చెప్ప‌రాని బాధ క‌లుగుతుంది. ఇక ఆర్థ‌రైటిస్‌లో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి ఆస్టియో ఆర్థ‌రైటిస్ కాగా మ‌రొక‌టి రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్‌. అయితే ఏ త‌ర‌హా ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య వ‌చ్చినా స‌రే.. అలాంటి వ్య‌క్తులు త‌మ జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ వైద్యులు సూచించిన మేర మందులు వాడుకోవాలి. అలాగే కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే దాంతో ఆర్థ‌రైటిస్ వ‌ల్ల వచ్చే నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


1. చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ డి పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల కీళ్ల వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. క‌నుక చేప‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉండే సోయా బీన్‌, చియా సీడ్స్‌, వాల్ న‌ట్స్ ను తీసుకున్నా ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

2. మొల‌కెత్తిన గింజ‌లు, క్యాబేజీ, బ్రొకొలితోపాటు తాజా ఆకుకూర‌లు, కూర‌గాయ‌లు, పండ్ల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

3. వెల్లుల్లిలో డ‌య‌లిల్ డై స‌ల్ఫైడ్ అనే స‌మ్మేళ‌నం పుష్క‌లంగా ఉంటుంది. ఇది ఆర్థ‌రైట్ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. అందువ‌ల్ల నిత్యం వెల్లుల్లిని తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది.

4. బోన్స్ సూప్ ను తాగ‌డం వ‌ల్ల కూడా ఆర్థ‌రైటిస్ నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. నొప్పులు త‌గ్గుతాయి.

5. ప‌సుపులో ఉండే క‌ర్‌క్యుమిన్ అనే స‌మ్మేళ‌నం ఆర్థ‌రైటిస్‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల నిత్యం ప‌సుపును ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆర్థ‌రైటిస్ స‌మస్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.


logo