ఆత్మ ప్రతీకారం


Sun,August 27, 2017 11:18 PM

lavanyaa
సందీప్‌కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ జెడ్. సి.వి.కుమార్ దర్శకుడు. ఎస్.బి.కె.ఫిల్మ్స్ పతాకంపై ఎస్.కె.బషీద్, ఎస్.కె.కరీమున్నీసా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌లో ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ పరిశోధన నేపథ్యంలో సాగే కథ ఇది. పరిశోధనాధికారిగా సందీప్‌కిషన్ నటించారు.ఆయన పాత్ర చిత్రన వినూత్న పంథాలో వుంటుంది. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ యువకుడు ఆత్మగా ఎందుకు మారాడన్నది ఆసక్తికరంగా వుంటుంది. మనిషి నలభై ఏళ్ల క్రితం ఎలా వున్నాడు? నలభై ఏళ్ల తర్వాత ఎలా వుంటాడు? అనే అంశాన్ని సినిమాలో ఆవిష్కరిస్తున్నాం. తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. సరికొత్త కథ, కథనాలతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే చిత్రమిదని దర్శకుడు చెప్పారు.

399

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles