e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home Entertainment మియా ఖ‌లీఫా ట్విట్ట‌ర్ అకౌంట్ బ్యాన్‌..

మియా ఖ‌లీఫా ట్విట్ట‌ర్ అకౌంట్ బ్యాన్‌..

మియా ఖ‌లీఫా ట్విట్ట‌ర్ అకౌంట్ బ్యాన్‌..

న్యూఢిల్లీ: మాజీ పోర్న్ స్టార్ మియా ఖ‌లీఫా టిక్‌టాక్ అకౌంట్‌ను పాకిస్థాన్‌లో బ్యాన్ చేశారు. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌ను నిషేధించిన‌ట్లు తెలుసుకున్న మియా .. ట్విట్ట‌ర్‌లో కౌంట‌ర్‌ రియాక్ష‌న్ ఇచ్చింది. పాక్ తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించిన ఆ స్టార్‌.. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఇక నుంచి అన్ని టిక్‌టాక్ వీడియోల‌ను పాక్ అభిమానుల కోసం రీపోస్టు చేయ‌నున్న‌ట్లు చెప్పింది. గ‌తంలో కూడా మియా ట్విట్ట‌ర్ అకౌంట్‌ను పాకిస్థాన్ రెండు సార్లు బ్యాన్ చేసింది. అయితే ఏప్రిల్‌లో రెండ‌వ బ్యాన్‌ను ఎత్తివేశారు. అనైతిక‌మైన కాంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్న నేప‌థ్యంలో మియాపై పాక్‌లో బ్యాన్ విధించారు. అయితే ఈ సారి ఆమె అకౌంట్‌ను ఎందుకు బ్లాక్ చేశారో అధికారులు క్లారిటీ ఇవ్వ‌లేదు. మియాకు టిక్‌టాక్‌లో 2.2 కోట్ల మంది ఫాలోవ‌ర్లు.. 27 కోట్ల లైక్‌లు ఉన్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రుగుతున్న అన్ని వివాదాల‌పై మియా రెగ్యుల‌ర్‌గా ట్వీట్ చేస్తోంది. ఇండియాలో రైతుల నిర‌స‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన మియా ఖ‌లీఫాపై ఫిబ్ర‌వ‌రిలో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మియా ఖ‌లీఫా ట్విట్ట‌ర్ అకౌంట్ బ్యాన్‌..

ట్రెండింగ్‌

Advertisement