e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home ఎడిట్‌ పేజీ అభివృద్ధిని కొనసాగిద్దాం

అభివృద్ధిని కొనసాగిద్దాం

అభివృద్ధిని కొనసాగిద్దాం

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల నామినేషన్‌ గడువుకు ఒకరోజు ముందు నోముల నర్సయ్య కుమారుడు భగత్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కేసీఆర్‌ ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఇద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. కేసీఆర్‌పై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలతో ఒకరు, తనను గెలిపిస్తే మొత్తం రాష్ర్టాన్నే ఇంకేదో చేస్తానని మరొకరు ప్రజలను తప్పుదోవ పట్టించే మార్గంలో పార్టీలు చాలావరకు కృషిచేశాయి. ఫలితం మాత్రం టీఆర్‌ఎస్‌కే దక్కింది.

రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుంచి ఒక్కటి కాదు, రెండు కాదు అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. 1956లో ఏర్పడిన రాష్ర్టాల కంటే తెలంగాణ రాష్ట్రం ఎంతో ముం దున్నది. ఆసియాలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన 270 టీఎంసీలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రజలు కనీసం కలలో కూడా ఊహించలేదు. రివర్స్‌ పంపింగ్‌ అనే వినూత్నమైన ఆలోచనతో ఆవిష్కరించిన ఈ ప్రాజెక్ట్‌ ద్వారా తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా నీరందుతుంది. ఏడాది పొడుగూతా పచ్చని పొలాలతో, ధాన్యరాశులతో నిండిపోవడం ప్రజ లు గమనిస్తున్నారు. మిషన్‌ భగీరథతో రాష్ట్రంలోని వేల గ్రామాలకు తాగు నీరు అందుతున్నది.

దశాబ్దాల ఫ్లోరైడ్‌ సమస్యకు పరిష్కారం లభించింది. మిషన్‌ కాకతీయ కింద 45 వేల చెరువుల పునరుద్ధరణ పనులు జరిగాయా లేదా? వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, బీడీ కార్మికులు పింఛన్లు అందుకుంటున్నా రు. పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందజేస్తున్నారు. గొల్లకుర్మలకు గొర్లు, బర్ల పంపి ణీ జరిగింది. బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు ప్రభుత్వం ఉచితంగా బట్టలను ఇస్తూ, మరోవైపు చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది. రైతుబంధు కింద వానకాలం, యాసంగి పంటలకు ఎకరాకు రూ.5 వేలు అందుతున్నాయి.

ఇవన్నీ గత ఆరేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న అనేక చర్యల్లో ఇవి కొన్నే. వ్యవసాయమంటే ఎంతో ఇష్టపడే కేసీఆర్‌ రైతులకు ఎట్టి పరిస్థితిలో కూడా అన్యాయం చేయరు. కోటి ఎకరాల మాగాణి అన్న నాయకుడు నేడు కోటి ముప్ఫై లక్షల ఎకరాల మాగాణిని చేశారు. పండిన పంటను గ్రామాల్లోనే ప్రభుత్వం కొంటున్నది. ఇందుకోసం అనేక కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం కూడా పూర్తవుతున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ర్టాలకు అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. ఈ నిజాలను గ్రహించాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సంతృప్తికరమైన స్థాయిలో ఫిట్‌మెంట్‌ను ప్రభు త్వం ప్రకటించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు కూడా పెంచింది. వ్యవసా యం, పరిశ్రమలు, విద్య, వైద్యం, శాంతిభద్రతలు మొదలైన అన్నిరంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం ఆదర్శప్రాయంగా ఉన్నది. ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇలాగే కొనసాగిద్దాం. ప్రభుత్వానికి మద్దతు ఇద్దాం.

అభివృద్ధిని కొనసాగిద్దాంకన్నోజు మనోహరాచారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధిని కొనసాగిద్దాం

ట్రెండింగ్‌

Advertisement