e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home ఎడిట్‌ పేజీ సారిచ్చిన రంగులు

సారిచ్చిన రంగులు

సారిచ్చిన రంగులు

బీడు బారుతున్న మా బతుకుల్లో
‘గులాబీ’ గెలుపు రంగులు అద్దాడు మా సారూ..
ఆడపిల్లల చేతులకి గోరింటాకు పెట్టినట్లు
‘కల్యాణలక్ష్మి’ కానుక పెట్టి నుదుటిపై
‘ఎరుపు’ బొట్టు పెట్టాడు మా సారూ..
రైతులకు తనే బంధువునంటూ
పచ్చని రైతుబంధు తోరణాలు
ఇంటింటా కట్టాడు మా సారూ..
‘నీలి’ ఆకాశమే కిందికి దిగిందా అనేలా
భగీరథ నీళ్లతో మా గొంతు తడిపాడు మా సారూ..
పసిపిల్లల బుగ్గల ‘తెలుపు’లో
సరస్వతీ దేవి వెలుగు చూడాలని
గురుకుల గుడులు కట్టాడు మా సారూ..
బతుకమ్మలో ‘పసుపు’ గౌరమ్మ
మమ్మల్ని కరుణించినట్టు
మా తెలంగాణ రాష్ర్టానికి రక్షకుడిగా
వచ్చాడు మా సారూ..
యాదవుల ఇండ్లలో తెల్లని పాల నురగలా
మత్స్యకారుల కండ్లలో నీలి విప్లవమై
పసిపిల్లల చదువు కోసం గులాబీ గురుకులాలై
ఈ రంగుల పథకాలతో మా బతుకుల్లో
చీకటి నలుపు జాడలు
మాయమయ్యేలా చేశాడు మా సారూ..
బతుకమ్మ చీరల్లో వలె మా జీవితాల్లో
రంగులు నింపినవు సారూ
అందుకోండి ఇవే ఆ హోలీ శుభాకాంక్షలు..

  • తుమ్మల కల్పనా రెడ్డి
    96404 62142
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సారిచ్చిన రంగులు

ట్రెండింగ్‌

Advertisement