మా ఊరు తమ్లపాకులకు మశూర్. కూజలకు మశూర్. కిల్లాకు గుడ్క మశూర్. గా కిల్లా ఒక్కటంటె ఒక్కటే నల్లరౌతు మీద ఉన్నది. రౌతు అంటె బుడ్డ రౌతు గాదు, పెద్ద గుట్ట. గది కూసున్న ఏన్గ తీర్గ ఉంటది. గా దాని మీద అంబారి లెక్క కిల్లా ఉంటది. గుట్ట కింద అన్మంతుని గుడి, శనివారం శానమంది గుడికాడనే గండ్ల బడ్తరు. సిన్న పోరలు అప్పలాచారి పంతులు బెట్టేది పులిగోర కోసం బోయెటోల్లు.
వైసు పోరలు పోరిలకు లైటు గొట్టెతంద్కు బోయెటోల్లు. జెర్ర గుట్ట ఎక్కంగనే పెద్ద దర్వాజ. గా దర్వాజ ముంగట రొండు తోపులు ఉండేటియి. గవ్విట్ల ఎండి, బంగారం ఉంటయని ఎవ్వడో జెప్పిండు. నివొద్దే అన్కోని కొందరు దొంగలు ఒక తోపు ఎత్కపోయిండ్రు. ఇగ దాంతోని కడ్మ తోపును దీస్కబోయి అమీన్ కచేరిల ఉంచిండ్రు. గిదంత బాగనే ఉన్నది గని ఇంతకు మీ ఊరు పేరేంది. ఎన్కట్కి నీ అసుంటోడే రేల్ టేషన్ బోయి మా ఊరికి టికిట్ ఇయ్యమన్నడట. గసువంటి అవులగాన్వి ఉన్న ట్లు గొడ్తున్నతని అంటున్నరా? పట్నం కెల్లి యాద్గిరి గుట్టకు పోవాలంటె మా ఊరి మీద్కెల్లే బోవాలె. అకల్ మం ద్కూ ఇషారా కాఫీహై అని అన్కోని ఇదువర్దాంక మా ఊరు పేరు జెప్పలేదు గంతే.
మా ఊరు బోన్గిరి, బగ్గ సద్వుకున్నోల్లు మా ఊరును భువనైకగిరి అని అంటుంటరు. త్రిభువన మల్లుడనేటి రాజు కిల్లా గట్టిపిచ్చి పాలించిండు. గాయిన పేరు మీద మా ఊరికి త్రిభువగిరనేటి పేరొచ్చింది. గదె భువనగిరి అయ్యింది. గని శాన మంది బోన్గిరి అనే అంటరు. గంజ్‌ల పెద్ద పెద్ద దుక్నాలున్నయి., హోటల్లున్నయి. బార్లున్నయి. బీట్ ఉన్నది. పిట్రోలు పంపున్నది. బస్సులు గాన్నే ఆగేటియి. రేల్ టేషన్ గుడ్క గంజ్ దగ్గర్లనే ఉన్నది. ఊల్లె సర్కార్ దవాకాన ఉన్నది. బారత్ టాకీస్ అనేటి సిన్మ తేటర్ ఉన్నది. జడల్ రాములు కల్లు కాంపౌండ్ ఉన్నది. చెప్పుడు యాదిమర్సిన రొండు హోటల్లు గుడ్క ఉండేటియి. ఒకటి శంకరయ్య హోటల్. ఇంకొక్కటి ఇందిరా బవన్, గంజ్‌ను కొత్త బోన్గిరి, ఊరును పాత బోన్గిరనొచ్చు.
మేము ఊల్లె బహార్ పేటల ఉండెటోల్లం. మూడు సర్కార్ బడులల్ల నేను మా దోస్తులు సద్వుకున్నం. ఒకటేమొ బాగాయత్ బడి. గిండ్ల మూడో తర్గతి దాంక ఉండేది. రెండోది బీచ్‌మహల్లా బడి. గీదాంట్ల నాల్గో తర్గతికెల్లి ఎన్మిదో తర్గతి దాంక ఉండేది. మూడోది పెద్ద బడి. గిండ్ల తొమ్మిదో తర్గతి కెల్లి పన్నెండో తర్గతి దాంక ఉండేది. మేము పన్నెండో తర్గతిల ఉండగ తెలంగాన మూమెంటొచ్చింది. బడులు బందైనయి, కాలేజీలు బందైనయి. మా సద్వు గుడ్క బందైంది. జై తెలంగాన అన్కుంట తిర్గినం. బూకర్తాల్ జేసినం. జేల్లకు బోయినం. యాడాదైనంక పరీచ్చలైనయి, అందరం పాసైనం. మమ్ములను మూమెంట్ బ్యాచ్ లేకుంటె 69 బ్యాచ్ అనేటోల్లు.
ప్రమోద్ ఇల్లు మా ఇంటి దగ్గర్లనే ఉండేది. గాడు నా సోపతోడు, తొమ్మిదో తర్గతికెల్లి పన్నెండో తర్గతి దాంక ఇద్దరం కల్సి సద్వుకున్నం. మేము ఊల్లె బాహర్పేటల ఉండేటోల్లం. మా వాడకట్టు రొం డు మూడు మైల్ల దూరంల రేల్‌టేషన్ ఉన్నది. బోన్గిరి తాలుక అయినంక గూడ డిగ్రీ కాలేజీ లేకుండె. డిగ్రీ సద్వాలంటె పట్నం లేకుంటె లష్కర్‌కు బోవాలె. ఒకటి రెండు పార్లే మేము పట్నం; లష్కర్లకు బోయినం గదీ మా పెద్దోల్లతోని. మా ఊల్లె మాద్రాస్ ఎక్స్‌ప్రెస్ ఆగేడ్ది. గది పొద్దుగాల ఏడున్నర గొట్టంగ వచ్చేది. గా రేల్ గాడి అద్దగంటల లష్క ర్కు బోయేడ్ది. మల్ల మాపటీల నాలుగొట్టంగ లష్కర్కెల్లి ఎల్లేది. లష్కర్ టేషన్కు దగ్గర్లనే సర్దార్ పటేల్ కాలేజీ ఉన్నది. గది మా అసువంటోల్లతోనే షురువైంది. గంజ్‌ల ఉన్న మా సోపతి గాల్లందరు గా కాలేజ్లీ షరీకైండ్రు. గాల్లు సీజన్ టికిట్ దీస్కొని అప్పెండ్ డౌన్ జేసటోల్లు. సత్తెన్న నన్ను, ప్రమోద్ను దీస్కబోయి సర్దార్ పటేల్ కాలేజ్‌ల షరీక్ జేసిండ్రు. గాయిన మా సోపతోని పెద్దన్న.
మా ఊరు హ్యాండ్లూమ్
టెరీకాటన్కు గుడ్క మశూరే. ఊల్లె లాగు లు దొడుక్కున్నా నడ్సింది. పట్నంల నడ్వదని మా అన్న నాకు రొండు హ్యాండ్లూమ్ టెరీకాటన్ పైంట్లు బట్టిచ్చిండు. గవ్వి దొడ్కోని
కాలేజ్‌కి బోయేటోన్ని. మూడ్దినాలైనంక ఒక పైంటు మాసిపోయింది. గాదాన్ని ఉత్కిన. ఇంకొక పైంటు దొడుక్కొని కాలేజ్‌కి బోయిన. అటెంకల మూడు దినాలకు గదాన్ని ఇడ్సిన. ఇడ్సి ఫస్టు పైంటు దొడుక్కున్న. గది రొండించులు పాదాల మీద్కి బోయింది.
హ్యాండ్లూమ్ టెరీకాటన్ను ముందుగాల నీలల్ల నానబెట్టాలె. ఆరెయ్యాలె. అటెంకలె మేరాయినకు ఇయ్యాలె. జెల్దిల మావోల్లు నానబెట్టకుంటనే పైంట్లు పట్టిచ్చిండ్రు. ఏం జేస్త గుం జిన పైంటునే ఏస్కోని కాలేజ్‌కి బోయిన. నా పైంటు జూసి మా కాలేజ్‌ల ఒక పట్నం పొల్లగాడు నగుకుంట నా తాన్కి వొచ్చిండు. ‘అరే లత్కోర్ ఏ ఊరికెల్లి వొచ్చినవురా?’ అని అడిగిండు.
ప్యారిస్ ఫ్యాషన్లకు మశూరని యాన్నో సద్విన సంగతి నాకు యాదికొచ్చింది. ‘నేను ఊరోన్ని గాదు, నువ్వే ఊరోన్వి ఉన్నట్లు గొడ్తున్నది’ అన్న. ‘ఊరోన్వి గాకుంటె గా పైంటు ఏందిరా?’ ‘నీకెర్కలేదా గిది కొత్త ఫ్యాషన్’ ‘నీకెట్ల ఎర్కరా’ ‘నెల దినాల కింద ప్యారిస్ కెల్లి మా అన్నొచ్చిండు. గాదే గీ పైంటు దెచ్చిండు. ‘గట్ల నా’ అన్కుంట గాడు బోయిండు. రెండు దినాలైనంక సూస్తె, గాని పైంటు సుత రొండించులు పాదాల మీద్కి ఉన్నది. గాన్ని జూసి ఇంకొకుడు పాదాల మీద్కి పైంటు కత్తిరిచ్చుకుండు. గిట్ల మా కాలేజ్‌ల శానమంది ఒకన్ని ఊసి ఇంకొకడు పాదా ల మీద్కి పైంటు కత్తిరిచ్చుకున్నరు. నేను జెప్పిన అవద్దం మా కాలేజ్‌ల కొత్త ఫ్యాషనైంది.