మనిషిని మనిషి తాకలేని వైనం..
చేయిచేయి కలపలేని దైన్యం..
హృదయాలను హత్తుకుని
ఆప్యాయతలను పంచుకోలేని కాలం..
ఇప్పుడు కరోనాతో మనిషి జీవితం చిధ్రం..
ఇక ముందు ముందు ఏమి చేయాలనో చైనా వ్యూహం..
ఆఖరి మజిలీ కూడా అల్లకల్లోలం..
ఆత్మీయుల ఆఖరి చూపునకు నోచుకోని దౌర్భాగ్యం..
శవాలను దహనం చేయలేక గంగ పాలు చేసే కాలం..
జేసీబీలతో అంతిమ సంస్కారాలను నిర్వహించే కాలం..
ఆప్యాయతలను, ఆత్మీయతలను కట్టి
అటకమీద పడేసే కాలం..
మనిషి జాతిని కరోనా పట్టి పీడిస్తున్న కాలం..
ఇది ధైర్యంగా ఉండాల్సిన కష్టకాలం..