e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎడిట్‌ పేజీ తెలంగాణ అస్తిత్వ అక్షర రూపం

తెలంగాణ అస్తిత్వ అక్షర రూపం

తెలంగాణ అస్తిత్వ అక్షర రూపం

పరుసుకున్న అమాసలో పాలపుంత నవ్వులొంపినట్లు; తెలంగాణ ఎర్రమట్టి పేడ అలుకు వాకిళ్లలో, వాకిలి ముంగిళ్లలో ముగ్గులేసినట్లు.. తెలంగాణ బతుకు చిత్రణం ‘నమస్తే తెలంగాణ’. తెలంగాణ జీవితం అక్షరరూపమై అందంగా చిత్రిక పట్టిన ‘నమస్తే తెలంగాణ’కు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జేజేలు. తెలంగాణ పలుకుబడి, మన యాస, మన హృదయాన్ని, వాకిలిని మనమే తడముకున్న అనుభూతి అక్షర దీపం ‘నమస్తే తెలంగాణ’.

తెలంగాణ అస్తిత్వ అక్షర రూపం

వలసాధిపత్యంపై ఎక్కుపెట్టిన వచనపు విల్లు ‘నమస్తే తెలంగాణ’. వివక్షకు గురై విస్మరించబడ్డ తెలంగాణ కవుల-కథకుల సాహితీరూపకాలకు అగ్రస్థానం ఇచ్చి తెలంగాణ సాహితీ ప్రభను శిఖరాయమాన స్థానంలో నిలిపిన పత్రిక ‘నమస్తే తెలంగాణ’. సబ్‌కా మాలిక్‌ సహజీవనత్వాన్ని చాటి గంగా జమునా తెహజీబ్‌ జీవన సౌందర్యాన్ని నిలిపింది ‘నమస్తే తెలంగాణ’. బతుకమ్మను చిత్రిక పట్టి, పాలపిట్టకు పబ్బతి పట్టి, బోనం కుండకు బొట్టు పెట్టి, తెలంగాణ సాంస్కృతిక పతాకను ఎత్తిపట్టి జయజయమానంగా వెలుగొందుతున్న పత్రిక ‘నమస్తే తెలంగాణ’. విజయానికి చిరునామా ‘నమస్తే తెలంగాణ’. ఎన్నో ప్రజా విజయాలకు ప్రతీక ‘నమస్తే తెలంగాణ’. సాగుమడికి, పసిడిరాసుల గుడికి, అక్షర హారతిపల్లెం‘నమస్తే తెలంగాణ’. తెలంగాణ ఊపిరి, ఉనికి. చలనం, జ్వలనం ‘నమస్తే తెలంగాణ’.

  • గోరటి వెంకన్న , 94413 66515

అద్భుత ఆవిష్కరణలై తీరినవి!

తెలంగాణ అస్తిత్వ అక్షర రూపం

నూతన తెలంగాణ ఆవిర్భావం, ఏర్పాటు ఒక కొత్త పత్రికగా ‘నమస్తే తెలంగాణ’ స్థాపన, ఆరంభం.. వంటివి అద్భుతావిష్కరణలై తీరినవి. అంతకుముందటి పరిస్థితులు, చోటిచ్చుకుంటూ వచ్చిన వినూత్నాంశాలూ, క్రొంగొత్త శీర్షికలతో అనూహ్యంగా కోటానుకోట్ల ప్రజలకందుతూనూ వచ్చింది.
నూతన ప్రక్రియలు, శీర్షికలతో ‘నమస్తే తెలంగాణ’ అశేష ప్రజానీకాన్ని విశేషంగా ఆకర్షిస్తూ ఆదరిస్తూ వచ్చింది. కేవలం వార్తలను చేరవేయుటకుగానో, రోజువారీ స్థితిగతులను గురించి రాయటం కోసం గానో పూనిక వహించలేదని, తెలంగాణ తనాన్నే కాకుండా, సమగ్రాభివృద్ధిని వ్యవస్థాపితం గావిస్తూ రావాలనెంచి ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఒక నిర్దుష్టమైన అభివృద్ధి ఎజెండాగానూ రూపొందింపజూసి శత్‌-ప్రతిశత్‌ విజయాన్ని కోట్లాది తెలుగువారికే గాక ఇరుగు రాష్ర్టాలకు కూడా సు(శ్రేష్ఠ)రచనలందజేస్తూ వచ్చిన
‘నమస్తే’కు అభి‘100’నాలు.

  • వేణు సంకోజు, 99484 19881

ఓ ఆర్గనైజర్‌ !

తెలంగాణ అస్తిత్వ అక్షర రూపం

పత్రిక ఒక ‘ఆర్గనైజర్‌’ అంటాడు లెనిన్‌. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు ‘నమస్తే తెలంగాణ’ ఓ ఆర్గనైజర్‌గా, ప్రజలను కదిలించే, నడిపించే శక్తిగా పనిచేసింది. ఆ అర్థంలో ఉద్యమ నిర్వహణకు కృషిచేసిన ‘నమస్తే తెలంగాణ’చరిత్రలో నిలిచిపోతుంది.

పదేండ్లుగా ‘నమస్తే తెలంగాణ’ సాహిత్య పేజీ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నది. విభిన్న దృక్పథాల విభిన్న వాదాల సాహిత్యానికి సమాన ప్రాతినిధ్యం కల్పించే వేదికగా సాహిత్య పేజీ నిర్వహిస్తున్నందుకు అభినందనలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాహిత్య విశిష్టతను చాటుతూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని పాదుకొలిపేందుకు ‘నమస్తే తెలంగాణ’ విశేష కృషి చేస్తున్నది. ‘నమస్తే తెలంగాణ’ పదేండ్ల పండుగ జరుపుకొంటున్న ఈ సంతోష సమయంలో ‘నమస్తే తెలంగాణ’కు జేజేలు.

  • డాక్టర్‌ చెమన్‌, 94403 85563

బాట చూపిన దివిటీ

తెలంగాణ అస్తిత్వ అక్షర రూపం

‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఆరంభమై దశాబ్ద కాలం పూర్తయింది. తెలంగాణ ప్రజల భాషలో వచ్చిన మొట్టమొదటి పత్రిక ఇది. తెలంగాణ ఇంటిభాషలో ప్రాంతీయ, దేశీయ, అంతర్జాతీయ వార్తలను తెలియజేస్తూ తెలంగాణ ప్రజల అభిమానాన్ని పొందింది.

‘నమస్తే తెలంగాణ’లో రాజకీయ వ్యాసాలే గాక, ఆధ్యాత్మిక, తాత్త్విక, సాహిత్య విషయాలను చెప్పే వ్యాసాలు, స్త్రీల ప్రతిభను పరిచయం చేస్తూ వచ్చే వ్యాసాలతో ఈ పత్రిక ఇంటింటి పత్రికగా మారి ప్రజలను చైతన్యవంతులను చేసింది, చేస్తున్నది. ఆదివారం సంచిక ‘బతుకమ్మ’ కథల్ని, తెలంగాణ చారిత్రక, సాహిత్య అంశాలతో అకట్టుకున్నది. విశ్లేషణాత్మక సంపాదకీయ వ్యాసాలతో, సాహిత్యానికి ‘చెలిమె’ ఓ జీవధారగా తెలంగాణ సాహిత్య సాం స్కృతిక వికాసానికి తోడ్పడుతున్నది. ‘నమస్తే తెలంగాణ’ దశాబ్ది ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్తులో మరింత విస్తృత
స్థాయిలో అశేష ప్రజల మన్ననలు పొందాలని కాంక్షిస్తూ హార్ధిక శుభాకాంక్షలు.

  • ముదిగంటి సుజాతారెడ్డి ,99634 31606

ప్రజలకు అండగా ‘నమస్తే తెలంగాణ’
‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రారంభమై పదేండ్లు పూర్తయిన సందర్భంగా యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు. తెలంగాణ ప్రజలకు ఈ పత్రిక అత్యంత ప్రయోజనకారిగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలోనే ప్రారంభమైన ఈ పత్రిక ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది.

తెలంగాణ అస్తిత్వ అక్షర రూపం

తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఇక్కడ జరుగుతున్న అనేక కార్యక్రమాలను.., ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను గూర్చి ప్రజలకు తెలియజేయటంలో ముందుంటున్నది. తెలంగాణ నుంచి వెలువడుతున్న పత్రికల్లో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక అగ్రశ్రేణికి చెందిన పత్రికగా రూపొందింది అనటంలో సందేహం లేదు. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక సాహిత్యానికి కూడా ప్రముఖ స్థానం ఇస్తున్నందుకు ఒక రచయితగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ పత్రిక భవిష్యత్తులో ఇంకా అనేక శీర్షికలతో ప్రజల అభిమానాన్ని చూరగొనగలదని ఆశిస్తున్నాను.

  • అంపశయ్య నవీన్‌, 99892 91299

చైతన్యాన్ని రగిలించిన
‘నమస్తే తెలంగాణ’ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో తెలంగాణ ప్రజలు ఉద్యమానికి పూనుకున్నప్పుడు సాహిత్య, సాంస్కృతిక చైతన్యాన్ని కలిగించి అండగా నిలిచిన పత్రిక ‘నమస్తే తెలంగాణ’. మన భాష, సంస్కృతి, సాహిత్య అస్తిత్వాల భావనలతో ఉద్యమానికి పురుడు పోయటానికి పూనుకున్నది.

తెలంగాణ అస్తిత్వ అక్షర రూపం


ఆధిపత్య భాషకు, సాహిత్యానికి తెలంగాణ సాహితీ సంస్కృతికి దీటుగా నిలుచునేట్లు శ్రమించింది. సాహిత్య పేజీల ద్వారా ఇక్కడి వారి సృజనాత్మక సాహిత్యానికి గౌరవాన్ని చేకూర్చింది. మనదైన సాహిత్య బుద్ధిని మార్గనిర్దేశ నం చేసింది. మన రచనలకు తగిన గౌరవం పోదు చేసింది. తెలంగాణ జీవన వేదననీ, అస్తిత్వాన్నీ,ఘర్షణను ఆదివారం అనుబంధంలో ప్రచురిస్తున్న కథల ద్వారా సాహిత్యవేదిక మీద ప్రతిష్టించింది ‘నమస్తే తెలంగాణ’. నా దగ్గర ఒక పరిశోధక విద్యార్థి ‘నమస్తే తెలంగాణ’ అనుబంధంలో వచ్చిన కథలపై పరిశోధన చేస్తున్నాడు. మునుముందు తెలంగాణ సాహిత్య చరిత్రకు, విమర్శకు మార్గం వేయాలని నా ఆకాంక్ష. పాట, కవిత ప్రచురితమవుతున్న విధంగా నవలను విస్తృతపర్చటానికి పూనుకోవాలి. ఇంటర్వ్యూలు ప్రచురించాలి. సరికొత్త ఆలోచనలకు, ప్రయోగాలకు సాహిత్య కవాటాలు తెరవాలి. పదేండ్లు నిండిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు అభినందనలు.

  • డాక్టర్‌ నాళేశ్వరం శంకరం
    94404 51960

సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఊతం
సుదీర్ఘ కాలగమనంలో ఒక దశాబ్ది స్వల్పమైనదే అయినప్పటికీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంతవరకు గత పదేండ్ల కాలం చాలా ముఖ్యమైనది. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయం. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల ఆవిష్కరణకు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని వార్తా పత్రికలున్నా మనకంటూ ప్రత్యేకించి ఒక పత్రిక ఉండవలసిన అవసరాన్ని గుర్తెరిగిన తరుణం. ఆ నేపథ్యంలో సరిగా పదేండ్ల కిందట ‘నమస్తే తెలంగాణ’ అవతరించింది.

తెలంగాణ అస్తిత్వ అక్షర రూపం

తెలంగాణ సాహితీ సాంస్కృతిక రంగాల్లో పత్రిక విశేషమైన కృషి చేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమ సాహిత్యానికి ఊతంగా నిలిచింది. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఆవిర్భావానంతరం మూడేండ్లకు తెలంగాణ రాష్ర్టావతరణ జరిగింది. ఈ ఏడేండ్లలో తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగాల ఉద్దీపనకు శాయశక్తులా దన్నులా నిలిచింది. తెలంగాణ చేతనాద్యుతుల్ని దేదీప్యమానం చేయడంలో తలమునకలైంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపడంలోనూ పత్రిక కృషి తక్కువేమీ కాదు. తెలంగాణ సాహిత్యంలో ఉండిపోయిన ఖాళీల మీద దృష్టిసారించి రచయితలను ఆ దిశగా ప్రోత్సహించటం హర్షణీయం.

  • నలిమెల భాస్కర్‌, 97043 74081
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ అస్తిత్వ అక్షర రూపం

ట్రెండింగ్‌

Advertisement