e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home ఎడిట్‌ పేజీ ఉద్యమ బాలుడు నవతరం నాయకుడు

ఉద్యమ బాలుడు నవతరం నాయకుడు

ఆయన నవశకానికి దిక్సూచి. యువతరానికి ఐకాన్‌. ఐటీహబ్‌ నిర్మాణ సారథి. సామాన్యులకు కష్టమొస్తే నేనున్నానంటూ భరోసానిచ్చే మనసున్న నాయకుడు. అంతర్జాతీయ వేదికలపై దేశాధినేతలను మెప్పించిన రాజకీయ చతురుడు. అనతికాలంలోనే ఎన్నో అంతర్జాతీయ సంస్థల ద్వారా అవార్డులను సొంతం చేసుకున్న మోడర్న్‌ లీడర్‌. దశాబ్ద కాలంలో సిరిసిల్ల నియోజకవర్గ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయడమే కాదు, తాను చేపట్టిన శాఖల్లో ఎన్నో విప్లవాత్మక, వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆదర్శప్రాయుడు కల్వకుంట్ల తారక రామారావు.

ఉద్యమ బాలుడు నవతరం నాయకుడు

స్వరాష్ట్రంలో మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన కేటీఆర్‌ అధికారం ఉంటే అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టించవచ్చో నిరూపించారు. ఐటీ రంగం దశ దిశలను మార్చి చూపించారు.పరిశ్రమలు, పురపాలక శాఖల్లో కీలక మార్పులు తెచ్చి ప్రజలకు పాలన సత్ఫలితాలను అందించారు. రాష్ట్రస్థాయిలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుడుతూనే తనకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు.

- Advertisement -

గొప్ప చదువు, కొలువు, వారసత్వంగా ఎంతో పేరు ప్రఖ్యాతి కలిగిన కేటీఆర్‌ పురిటిగడ్డ విముక్తి కోసం నేను సైతం అని కదిలారు. తరతరాల బానిసత్వం, దోపిడీపై తనదైన శైలిలో తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్ష కోసం ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు కేటీఆర్‌. ఉమ్మడి కరీంనగర్‌ వేదికగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, పార్టీలో, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన, రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నారు.

కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌లో కార్యకర్తగా మొదలై అంచెలంచెలుగా ఎదిగారు. 2004 నుంచే పరోక్ష రాజకీయాల్లో పాలుపంచుకుంటూ వచ్చారు. 2004 జమిలి ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేం ద్రం నిర్లక్ష్యం వహించడం, అసలు తెలంగాణవాదమే లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు ఎద్దేవా చేసిన సందర్భం అది. ఈ నేపథ్యంలో ప్రత్యే క రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటేందుకు 2006లో ఎంపీ పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. దీంతో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సమయంలో కేటీఆర్‌ ప్రజల ముందుకువచ్చారు. ప్రజలను కలిసి వారి లో ఉద్యమస్ఫూర్తి నింపారు. ఆ ఎన్నికలో కేసీఆర్‌ రెండు లక్షల పైచిలుకు మెజారిటీతో ఘనవిజయం సాధించి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటిచెప్పారు.

కరీంనగర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కేటీఆర్‌ అకుంఠిత దీక్షతో పనిచేశారు. కేసీఆర్‌ను గెలిపించాలని పలు నియోజకవర్గాల్లో ఒక సామాన్య కార్యకర్తగా ప్రచారం చేశారు. 2008లో మరోసారి కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగిన సమయంలోనూ నేరెళ్ల, అలాగే సిరిసిల్ల పట్టణ కేంద్రంగా కేటీఆర్‌ విస్తృతస్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో అనేక సందర్భాల్లో క్రియాశీలక పాత్ర పోషించి కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారు. 2009లో కేసీఆర్‌ను అరెస్టు చేసిన సమయంలో ముం దుండి పోరాడారు.

1952లో ఏర్పడిన సిరిసిల్ల నియోజకవర్గంలో 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో పలు మండలాలు అటు ఇటుగా మారాయి. అక్కడినుంచే కేటీఆర్‌ తన రాజకీయ ప్రస్థానాన్ని మొద లుపెట్టారు. అంతకుముందు కమ్యూనిస్టు సీనియర్‌ నేత చెన్నమనేని రాజేశ్వర్‌రావు సిరిసిల్ల నుంచి ఐదుసార్లు విజయం సాధించి జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. జనశక్తి, పీడీఎఫ్‌ వంటి విప్లవ పార్టీల అభ్యర్థులను కూడా గెలిపించిన చరిత్ర సిరిసిల్లది. 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్‌ నాడు జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి గెలుపొందారు.

తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010 ఉప ఎన్నికల్లో 68,219 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో 53,004 ఓట్ల మెజారిటీ, 2018 ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజారిటీతో ఎప్పటికప్పుడు ప్రజాభిమానాన్ని పెంచుకుంటూ వచ్చారు.
అనంతరం టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పరిశ్రమలు, సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

ప్రతి రంగంలోనూ ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో తనదైన ముద్రవేశారు కేటీఆర్‌. స్వరాష్ట్రంలో తొలిసారి మంత్రి పదవి చేపట్టి, అధికారం ఉంటే అభివృద్ధి ఎలా చేయవచ్చో నిరూపించారు. ఐటీ రంగం దశ దిశలను మార్చి చూపించారు. పరిశ్రమలు, పురపాలక శాఖ ల్లో కీలక మార్పులు తెచ్చి ప్రజలకు పాలన సత్ఫలితాలను అందించారు. రాష్ట్రస్థాయిలో ఎన్నో సంస్కరణలకు శ్రీకా రం చుడుతూనే తనకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. గడిచిన దశాబ్దానికి పైగా కాలంలో సిరిసిల్ల ముఖచిత్రాన్ని మార్చివేశా రు. అభివృద్ధిలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలిపారు. ముఖ్యం గా చేనేతకు జీవం పోసి, నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఎవరికి ఏ ఆపదొచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తున్న బాధ్యత గల నాయకుడిగా నిలిచారు. సామాజిక మాధ్యమాల్లో సమస్యను తెలిపినా ఓర్పు తో పరిష్కరిస్తూ.. భవిష్యత్‌ తెలంగాణ యువ నాయకత్వానికి ఆదర్శంగా కేటీఆర్‌ నిలుస్తున్నారు.

(రేపు కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా..)

సంపత్‌ గడ్డం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉద్యమ బాలుడు నవతరం నాయకుడు
ఉద్యమ బాలుడు నవతరం నాయకుడు
ఉద్యమ బాలుడు నవతరం నాయకుడు

ట్రెండింగ్‌

Advertisement