e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home ఎడిట్‌ పేజీ రాష్ట్రంలో రెండు దృశ్యాలు

రాష్ట్రంలో రెండు దృశ్యాలు

తెలంగాణలో నెల రోజులుగా రెండు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఇనుమడించిన ఉత్సాహం, పట్టుదలతో ప్రజోపయోగ కార్యక్రమాలను వరుసగా ప్రభుత్వం చేపడుతుండగా, ప్రతిపక్షాల విమర్శలు, హంగామాలు ఉన్నట్లుండి గతం కన్న ఎక్కువగా పెరిగిపోయాయి. ఈ రెండు దృశ్యాలను గమనిస్తున్న ప్రజలకు ఎవరేమిటన్నది బాగా అర్థమవుతున్నది.

ప్రతిపక్షపు బరిలో కొత్త పోటీదారులు వచ్చారు. పాత పార్టీల కొత్త పాత్రధారులు కొందరైతే, కొత్త పార్టీల సరికొత్త పాత్రధారులు మరికొందరు. వీరందరు ఇప్పుడు తమ శక్తియుక్తులను రుజువు చేసుకోవలసి ఉంది. రుజువు చేసుకోవటం రెండు విధాలుగా జరగాలి. ఒకటి, అధికారపక్షంతో పోటీపడుతూ నిలదొక్కుకోవటం. రెండు, ప్రతిపక్షంలోని ఇతర పాత్రధారుల కన్న తమ ది పైచేయి చేసుకోవటం. ఆ విధంగా వారిది ఇద్దరు ప్రత్యర్థులతో రెండు చేతుల చేసే యుద్ధమవుతుంది.

రాష్ట్రంలో రెండు దృశ్యాలు
- Advertisement -

ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ ఎందువల్ల వేగవంతం చేశారో అర్థం చేసుకోవటం కష్టం కాదు. కరోనా వల్ల అనేక పనులు మందగించాయి. ఇది ఇప్పటికే అమలవుతుండిన వాటికి, కొత్తగా చేపట్టదలచిన వాటికి కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, సంస్థలు ఉద్యోగులు గైర్హాజరీ వల్ల సరిగా పనిచేయలేకపోవటం, బయటి కూలీలు వెళ్లిపోగా స్థానికులకు సైతం పనులు తగ్గటం, ప్రభుత్వ ఆదాయ వనరులు దెబ్బతినటం, ప్రైవేట్‌ ఆర్థికరంగం, ప్రజల వ్యక్తిగత ఆదాయాలు కుంటుపడటం, పనులు చేసేవారు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడటం వంటివి ప్రభుత్వ కార్యక్రమాల మందగింపునకు కారణమయ్యాయి. వాస్తవానికి ఇది ప్రపంచమంతటా కనిపించిన స్థితి. అయినా కేసీఆర్‌ సమర్థవంతమైన వ్యవహరణ వల్ల ఇతర రాష్ర్టాల కన్న తెలంగాణ త్వరగా పుంజుకోవ టం మొదలుపెట్టింది. దానితో పాటు, రాష్ట్రంలో కరోనా నెమ్మదిస్తుండటం సుమారు నెలరోజుల కిందట మొదలు కాగా, ఈ అవకాశాన్ని శీఘ్రంగా చేతిలోకి తీసుకున్న కేసీఆర్‌, కార్యక్రమాల వేగాన్ని పెంచివేశారు. ఏడాది కాలంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకుంటూ త్వరగా ముందుకువెళ్లాలన్నది ఆయ న ఆలోచన అయినట్లు భావించాలి. చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి గల ఏ ప్రభుత్వాధినేత అయినా చేసేది ఇదే.

ఈ విధంగా మొదలైన కార్యక్రమాలు రాష్ట్రంలో ఒక ఆశావహ వాతావరణాన్ని సృష్టించాయి. అవి అప్పుడప్పుడో, చిన్నస్థాయిలోనో జరిగితే ఈ తరహా వాతావరణం ఏర్పడదు. ముఖ్యమంత్రి అనేక శాఖలు, పథకాలు, పాతవీ కొత్తవీ అయిన వివిధ కార్యక్రమాలపై సమీక్షలు, ఆదేశాలతో, నివేదికలు తెప్పించుకోవటంతో, వెంటవెంటనే ఆర్థిక కేటాయింపులతో, అవసరమైన ఉద్యో గ నియామకాలతో అనునిత్యం తలమునకలుగా కన్పిస్తున్నారు. ఇదంతా ఛాన ళ్లు, పత్రికల్లో వెలువడుతూ, ఇతరత్రా ప్రత్యక్షంగా కనిపిస్తూ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఏ వర్గం కూడా ఇం దుకు మినహాయింపు కావటం లేదు. ఆశావహ ‘వాతావరణం’ అనేది ఏర్పడుతున్నది అందువల్లనే. చివరికి ప్రభుత్వాన్ని తరచూ విమర్శించే వ్యక్తులు కూడా ఇటీవలి వారాలలో, ‘ఏంది, సారు జోరుగా పోతున్నడు’ అనే అర్థంలో మాట్లాడటం వినవస్తున్నది. మనం మొదట ప్రస్తావించుకున్న రెండు దృశ్యాలలో ఇది ఒకటి.

ఇక రెండవ దృశ్యం ఏ విధంగా ఉంది? అందులో మౌలికంగా గానీ, స్వరూపరీత్యాగానీ కొత్తదనం ఏమీ లేదు. ప్రజలు ఏడేండ్లుగా గమనిస్తున్నదే. దాని గురించి వారు తమ అభిప్రాయం తాము ఏర్పరుచుకుంటున్నదే. కాని ఇప్పుడు నెల రోజులుగా అదే ధోరణి మరింత పెచ్చరిల్లుతున్నది. ఇందుకు రెండు కారణాలున్నాయి. ప్రతిపక్షపు బరిలో కొత్త పోటీదారులు వచ్చారు. పాత పార్టీల కొత్త పాత్రధారులు కొందరైతే, కొత్త పార్టీల సరికొత్త పాత్రధారులు మరికొందరు. వీరందరు ఇప్పుడు తమ శక్తియుక్తులను రుజువు చేసుకోవలసి ఉంది. రుజువు చేసుకోవటం రెండు విధాలుగా జరగాలి. ఒకటి, అధికారపక్షంతో పోటీపడుతూ నిలదొక్కుకోవటం. రెండు, ప్రతిపక్షంలోని ఇతర పాత్రధారుల కన్న తమ ది పైచేయి చేసుకోవటం. ఆ విధంగా వారిది ఇద్దరు ప్రత్యర్థులతో రెండు చేతుల చేసే యుద్ధమవుతుంది.

విషయమేమంటే పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు వీరు మామూలు కన్న ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. అట్లా గురైనప్పుడు వ్యవహరించేతీరు రెండు విధాలుగా ఉండవచ్చు. తగిన వివేకం కలవారిలో సంయమనం కనిపిస్తుంది. ఆయా విషయాల మంచి చెడులేమిటి, నిజానిజాలేమిటి, ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయనే మూడింటిని గమనించి, అందుకు అనుగుణమైన వ్యూ హాన్ని రూపొందించుకుంటారు. వారి వ్యవహరణాశైలి, భాష అనే రెండు కీలకమైన విషయాలు తగినట్లు ఉంటా యి. రెండవ విధమైన వారికి ఇటువంటి వాటితో నిమిత్తం ఉండదు. వ్యవహరణలోగానీ, భాషలోగానీ ఎంత రెచ్చిపోతే ప్రజలను అంత మెప్పించవచ్చునని, ఒకవైపు అధికారపక్షంపైన, మరోవైపు తమకు పోటీదారులైన ఇతర ప్రతిపక్షాలపైన పైచేయి సాధించవచ్చునన్నది వారి నమ్మ కం. ఇటువంటి ధోరణిలో పడినవారికి రాష్ట్ర ప్రయోజనాలు సైతం పట్టవు. కృష్ణా, గోదావరి జలాల విషయమై కేంద్ర గెజెట్‌ పట్లవారి వైఖరి ఇందుకు తాజా ఉదాహరణ. వారు రాష్ట్రం కోసం నిలబడే బదులు రాష్ట్ర ప్రభుత్వంపై రాళ్లు వేస్తే తమకు రాజకీయ లాభం జరుగుతుందనుకోవటం కూడా ఈ రెండవ దృశ్యంలో భాగమే. ప్రజలు సహజంగానే దీనిని కూడా గమనిస్తున్నప్పుడు, అసలు మౌలికంగా వారి వ్యూహం ఎంతవరకు ఫలించగలదో ఊహించటం కష్టం కాదు.

టంకశాల అశోక్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాష్ట్రంలో రెండు దృశ్యాలు
రాష్ట్రంలో రెండు దృశ్యాలు
రాష్ట్రంలో రెండు దృశ్యాలు

ట్రెండింగ్‌

Advertisement