e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home ఎడిట్‌ పేజీ ప్రాణ స్పృహ.. జ్ఞాన స్పృహ

ప్రాణ స్పృహ.. జ్ఞాన స్పృహ

ప్రాణ స్పృహ.. జ్ఞాన స్పృహ

అమ్మ రెండు జడలు వేయగానే ఆ అమ్మాయి పుస్తకాల మూటను
చంకనేసుకొని వెళ్ళి వాకిట్లోని మనిషెత్తు పెరిగిన వేప చెట్టును
గట్టిగా కౌగలించుకుంది ఆప్యాయంగా.. మమకారంతో
‘దీనికి ఈ చెట్టంటే ఎంత ప్రేమో.. ఇది పుట్టిననాడే ఈ చెట్టు పెట్టినం’
అని అమ్మ పెరుగుతున్న వేప మొక్కను చూస్తూ లోలోపల పులకిస్తూండగా..
అమ్మాయి బడిదిక్కు ఆకాశంలోకి పావురంలా పరుగెత్తింది..

తర్వాత పదేళ్ళకు పాప.. జనని.. అంది
అమ్మా వందనా శివ అని ఒక సామాజిక కార్యకర్త ‘చిప్కో’ అనే
ఉద్యమాన్ని నిర్మించిందమ్మా..
హిమాలయాల్లో.. ప్రతి మనిషీ ఒక చెట్టును తోబుట్టువులా
కౌగలించుకొని మన చుట్టూ చెట్లను నాటి సంరక్షించాలె అన్న సందేశంతో..
మనిషి తోబుట్టువులా చెట్టును కౌగిలించుకోవడం.. అమ్మను పరవశింపజేసింది.

- Advertisement -

మరునాడు వర్షం చినుకులుగా కురుస్తున్న రోజు
అమ్మాయి, అమ్మ, తమ్ముడు, నాన్న.. ఇంకా ఊరు ఊరును వెంటేసుకొని
మొత్తం ఎనిమిది వందల మొక్కలను నాటారు.
ఎందుకో ఆ రాత్రి ఆ ఊళ్ళోని అందరూ తమ ఇంటిలో
ఏదో ఒక కొత్త జీవి పుట్టినట్టు పులకించిపోతూండగా..
అమ్మాయి చెప్పింది రచ్చబండ దగ్గర సమావేశమైన ఊరి జనానికి.
‘మీకు తెలుసా.. మనం విడిచిపెడ్తున్న వ్యర్థవాయువు కార్బన్‌ డయాక్సైడ్‌ను
తీసుకొని మనకు చెట్లు ప్రాణవాయువు ఆక్సిజన్‌ను దానం చేస్తున్నాయి’ అని..
దేవుడు మనను బ్రతికించడానికే ఈ చెట్లను పుట్టించాడు ఎరికేనా.. అందామె.
మనకు వ్యర్థమైన వాయువు చెట్లకెట్ల ప్రాణవాయువు అయ్యింది అనడిగాడు
ఒక నాల్గవ తరగతి బాలుడు
మానవమాత్రులం మనకు తెలియదు.. అదే సృష్టి రహస్యం అంది ఇంకా పెరుగుతున్న అమ్మాయి.

ఆ సాయంత్రం వెన్నెల రాత్రి ఆ అమ్మాయి మళ్ళీ ఎందుకో ఉరికి పెరిగి బాహువులను వాకిలంతా
కొమ్మలను పరుచుకున్న వేప చెట్టును గట్టిగా కౌగలించుకుంది.
వాకిట్లో నులక మంచంపై పడుకున్న అమ్మాయి తలను నిమురుతున్న తల్లితో అంది కూతురు.
మన ‘ఇంటర్నెట్‌’ నెట్వర్క్‌తో మనం అమెరికాలో ఉన్న అక్కతో మాట్లాడుతున్నాం ఫోన్లో
భగవంతుడు మనందరికి ప్రాణవాయువును జీవితాంతం నిరంతరాయంగా అందించడంకోసమే
ప్రపంచ వ్యాప్తంగా అరణ్యాలుగా, ఎవరూ నాటని అడవిచెట్లుగా మనకు వృక్షాలను వరమిచ్చి
విశ్వవ్యాప్త ‘పచ్చని చెట్ల నెట్వర్క్‌’ పశుపక్ష్యాదులనూ.. మనలనూ బ్రతికిస్తూంటే
ఆలోచించమ్మా.. ఒక్క పదినిముషాలు ప్రపంచవ్యాప్త చెట్ల నెట్వర్క్‌ స్తంభిస్తే
ప్రాణవాయువు మాయమై ఈ జీవప్రపంచం మొత్తం క్షణాల్లో ఎట్లా మృత్యుకూపమైపోతుందో
అమ్మ ఎందుకో ఆ క్షణం దిగ్గున లేచి కూర్చుని భోరున ఏడ్వడం ప్రారంభించింది.
సరిగా అప్పుడే అమ్మాయి
హృదయమున్న చెట్టుకు ‘ప్రాణంతో పాటు జ్ఞానం కూడా ఉందమ్మా’ అనడం వినబడలేదు –

రామా చంద్రమౌళి
93901 09993

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రాణ స్పృహ.. జ్ఞాన స్పృహ
ప్రాణ స్పృహ.. జ్ఞాన స్పృహ
ప్రాణ స్పృహ.. జ్ఞాన స్పృహ

ట్రెండింగ్‌

Advertisement