కాచుకు కూర్చున్నది కరోనా
కాలసర్పమై కాటువేయడానికి,
కప్పా వేరియెంటుగా మారి
కదం తొక్కనున్నది,
డెల్టా వేరియెంటుగా మారి
దారి కాయనున్నది,
లాంబ్డా వేరియెంటుగా మారి
లాకరేయనున్నది,
కరోనా ఎన్ని వేషాలు వేసిన,
ఎన్ని రూపాలు మారినా,
మనం మాత్రం దొరకకుండా
అడ్డుగోడలు నిర్మించుకుందాం,
అడ్డగోలుగా తిరగకుండా గిరి గీసుకుందాం,
విందులు వినోదాలు వాయిదా వేసుకుందాం,
మందులు చిందులతో తెగదెంపులు చేసుకుందాం,
యుద్ధం చేసి అలసిన
వైద్య వీరులకు విశ్రాంతినిద్దాం,
మరో ప్రపంచ విలయం రాకుండా
మనవంతు కృషి చేద్దాం,
మూడో ముప్పు రాకుండా ఆదిలోనే నిలువరిద్దాం,
భావి తరాలకు తరగని సామాజిక స్ఫూర్తిని అందిద్దాం!
డా .రావణవేణి
ప్రభాకర్ 9948996253