e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home ఎడిట్‌ పేజీ కరోనా చీకట్లో కాంతి కిరణం

కరోనా చీకట్లో కాంతి కిరణం

వరంగల్‌కు చెందిన ఆశ (58), ఎగువ మధ్యతరగతి దళిత క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. చదువు, ఆస్తులు, విదేశాల్లో తోబుట్టువులు ఉండి, జీవితంలో తనకంటూ ఎవరూ లేని ఒంటరి. తండ్రి ద్వారా సంక్రమించిన బడిలో అనేక మంది అనాథ పిల్లలకు సొంత డబ్బుతో చదువు చెప్పించిన చదువుల తల్లి. అనేకమంది అనాథ పిల్లలను పోషించినట్లే మూడురోజులకే తల్లిని పోగొట్టుకున్న పసిగుడ్డు సామ్యూల్‌ను చేరదీశారు.

గాంధీ దవాఖానలో మంచి నాణ్యమైన వైద్యం అందడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకత్వమే ప్రధాన కారణం. వ్యాక్సినేషన్‌లో తెలంగాణ జాతీయ సగటు కంటే ముందంజలో ఉన్నది. దేశాన్ని కరోనా రెండవ దశ తీవ్రంగా నష్టపరచింది. ఉత్తర భారతంలో దయనీయ పరిస్థితి. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండవ దశను సమర్థంగా ఎదుర్కొన్నది.

కరోనా చీకట్లో కాంతి కిరణం
- Advertisement -

ఆశ, నా భార్య అరుణ స్నేహితురాళ్లు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రూవ్‌ుమేట్స్‌ కూడా! ఓయూలో అనేక పోరాటాల్లో ఆశ క్రియాశీలకంగా పనిచేశారు. తర్వాతి కాలంలో తన తండ్రి ద్వారా సంక్రమించిన కాన్వెంట్‌ స్కూల్‌(కాజీపేట్‌)లో అనేకమంది పేద విద్యార్థులకు ఫీజులు లేకుండా విద్యాబుద్ధులు నేర్పించారు. తన సొంత డబ్బుతో వందల మంది అనాథ పిల్లలకు (దాదాపు ఐదేండ్లు) తన స్కూల్లోని హాస్టల్‌లో ఆశ్రయం కల్పించి చదువు చెప్పించిన దయార్ద్ర హృదయురాలు. అనేక మంది అనాథ పిల్లలను చేరదీసినట్లుగానే మూడురోజుల పసిగుడ్డు సామ్యూల్‌ను అక్కున చేర్చుకున్నది.

ఆశకు తండ్రి ద్వారా సంక్రమించిన కోట్ల రూపాయల ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. నమ్మినవాళ్లు మోసం చేసి కబ్జా చేయడంతో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నది. ఒక ప్రైవేటు బీఎడ్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ తన బాబు సామ్యూల్‌ను కార్పొరేట్‌ స్కూలులో చదివిస్తూ ఉన్నంతలో సంతృప్తితో జీవిస్తున్నది. సాఫీగా సాగుతున్న ఆశ, సామ్యూల్‌ జీవితాల్లో కరోనా చీకట్లను నింపింది. కరోనా వల్ల ప్రైవేటు బీఎడ్‌ కళాశాల నుంచి వేతనం అందలేదు. తనకు జీవనాధారం లేక ఆరు నెలలుగా రూమ్‌ కిరాయి కట్టలేని, తన బాబుకు సరైన భోజనం పెట్టలేని దీనస్థితికి చేరుకున్నది. తన పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేదు, ఎవరి సహకారాన్ని అర్థించలేదు. శారీరకంగా, మానసికంగా కుంగిపోయింది. ఈ పరిస్థితుల్లో కరోనా బారిన పడింది. ఏప్రిల్‌ 28 నుంచి మే 14 వరకు దగ్గు, జలుబుతో ఇబ్బంది పడింది. కానీ దవాఖానలో చూపించుకోలేదు, మందులు వాడలేదు. సామ్యూల్‌కి కూడా తన తల్లికి కరోనా వచ్చినట్టు తెలువదు. మే 10 నుంచి సామ్యూల్‌కు ఇంట్లో భోజనం లేదు. రాంనగర్‌లో తల్లి ఉంటున్న ఇంటి పక్కవాళ్లు అన్నం పెడితే తింటున్నడు, లేకపోతే ఉపవాసం ఉంటున్నడు.

మే 15న ఆశ తీవ్ర అనారోగ్యంతో ఉన్న విషయం తెలియడంతో, రాంనగర్‌లో ఉన్న ఆశ ఇంటికి వెళ్లాను. మాట్లాడలేని, కూర్చోలేని స్థితిలో గాంధీ దవాఖానలో చేర్పించాను. ఆశ గాంధీ దవాఖానలో చేరితే, పన్నెండేండ్ల సామ్యూల్‌ మా ఇంటికి చేరాడు. సామ్యూల్‌ను గవర్నమెంట్‌ కేర్‌ సెంటర్‌లో చేర్పించడానికి నా మనస్సు ఒప్పుకోలేదు. నా కుమారుడు పన్నెండేండ్ల చార్వాకకు సామ్యూ ల్‌ సమవయస్కుడు. నా భార్య అరుణ సామ్యూల్‌ను మా చార్వాకలాగే చూసుకుంది. మే 15 నుంచి జూన్‌ 4 వరకు ఆశ గాంధీ దవాఖానలో కరోనా చికిత్స తీసుకున్నది. దాదాపు వారం రోజులు వెంటిలేటర్‌పై చావుతో పోరా డింది. గాంధీలో చేర్పించినప్పుడు తన ఆక్సిజన్‌ శాచురేషన్‌ 78 మాత్రమే. ఆమెను నేను ప్రైవేటు దవాఖానలో చేర్చి ఉంటే 20 రోజులకు కనీసం 20 లక్షల బిల్లు అయ్యేదేమో.. అయినా బతికి ఉంటుందనే గ్యారంటీ లేదు! జీవచ్ఛవంలా ఉన్న ఆశను గాంధీలో చేర్పిస్తే, అక్కడి అనుభజ్ఞులైన వైద్యులు ఆమెకు ప్రాణం నిలిపారు.

బయట జరుగుతున్న దుష్ర్పచారానికి భిన్నమైన పరిస్థితులు గాంధీ దవాఖానలో ఉన్నయని చెప్పడానికి పై ఘటనే ఉదాహరణ. ప్రతిరోగికి డాక్టర్లు విలువైన వైద్యం అందిస్తున్నారు. ఒక్కో రోగిని రోజులో మూడు పూటలా ముగ్గురు డాక్టర్లు పర్యవేక్షిస్తారు. ప్రతిరోజు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు అన్ని వార్డులను తనిఖీ చేస్తారు. ప్రతి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ ల్లో అందిస్తున్న భోజనంలో మంచి పోషకాహారం ఇస్తున్నారు. పండ్లు, గుడ్లు, బాదం మిల్క్‌, డ్రై ఫ్రూట్స్‌ నిర్ణీత సమయాల్లో ఇస్తారు. కరోనా రోగి దవాఖానలో చేరినప్పటి నుంచి ఇంటికి వెళ్లేదాకా గాంధీ దవాఖానదే పూర్తి బాధ్యత. ఈ ఏడాది మార్చి 21 నుంచి మే 21 వరకు 9,894 మంది కరోనాను జయించి గాంధీ దవాఖాన నుంచి ఇండ్లకు చేరుకున్నారు. గతేడాది మార్చి 2020 నుంచి ఈయేడు జూన్‌ 13 వరకు 48,732 మంది గాంధీలో చేరి ఆరోగ్యవంతులయ్యారు. గాంధీలో చేరినప్పుడు చాలామంది రోగులు తీవ్ర అనారోగ్యంతో, చావు బతుకుల మధ్య చేరినవారే. వీరికి చికిత్స చేయడాన్ని గాంధీ వైద్యులు సవాలుగా స్వీకరించారు. కొత్త వైద్య పద్ధతులను అవలంబిస్తూ విజయం సాధించారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రప్రభుత్వం జ్వర సర్వేను నిర్వహించి కరోనా రోగులను ముందుగానే గుర్తించింది. వారికి సత్వరమే వైద్యం అందించడం వల్ల దవాఖానలపై భారం తగ్గింది. చాలా మంది ఇంటివద్దనే ఉంటూ కరోనాను జయించారు. మూడవ దశను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ వైద్యరంగానికి జవసత్వాలు నింపుతున్నారు. కొత్తగా ఏడు మెడికల్‌ కళాశాలలు, వరంగల్‌లో ఢిల్లీ ఎయివ్‌ తరహాలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్‌ సెంటర్ల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. రానున్న రెండేండ్లకు 10 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించడమే కాకుండా హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. దేశ విదేశాల్లోని అత్యుత్తమ వైద్య సేవలు, పద్ధతులను అధ్యయనం చేయిస్తున్నారు. ఆరోగ్య తెలంగాణ ఆవిష్కరణ కోసం కృషి చేస్తున్నారు.

డి.రాజారాం యాదవ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా చీకట్లో కాంతి కిరణం
కరోనా చీకట్లో కాంతి కిరణం
కరోనా చీకట్లో కాంతి కిరణం

ట్రెండింగ్‌

Advertisement