e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home ఎడిట్‌ పేజీ పల్లె వాకిట్లో ప్రగతి మేడలు

పల్లె వాకిట్లో ప్రగతి మేడలు

గ్రామీణ సంప్రదాయక విధాన వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకుపోతున్నారు. దీనిలో భాగంగానే ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభమై నేడు రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఎప్పుడో నిజాం కాలం నాటి భూ సర్వేలు, పట్టా విధానంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భూ సమస్యలను త్వరగా పరిష్కరించడానికి దోహదపడే వ్యవస్థల్లో ధరణి వెబ్‌సైట్‌ అత్యంత ముఖ్యమైనది.

పల్లె వాకిట్లో ప్రగతి మేడలు

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2021- 22 ఆర్థిక సంవత్సరానికి రూ.38 వేల కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తరింపజేయడానికి సమగ్ర కార్యాచరణ విధానాన్ని రూపొందించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఆ కోవ కు చెందినవే. ఆధునిక వ్యవసాయ విధానం, కొత్తరకం పంటలు వ్యవసాయ నియంత్రణ విధానంలో భాగంగా అమలవుతున్నాయి. ఆధునిక పనిముట్ల వాడకం, సాం ప్రదాయక ఎరువుల వినియోగం సమగ్ర సస్యరక్షణ, రసాయన రహిత వ్యవసాయ విధానాన్ని రూపకల్పన చేసింది. వ్యవసాయరంగంలో పెట్టుబడులు తగ్గించడానికి, కూలీల కొరతను తీర్చడానికి ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన వరి సాగు వెదజల్లే విధానం ఎంతో శ్రేయస్కరమైనది. గ్రామాల్లో అడవుల సంరక్షణలో భాగంగా విస్తృతంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని హరితహారం ద్వారా చేపట్టడం జరిగింది. నాటుతున్న మొక్కల పరిరక్షణకు సర్పంచ్‌ ఇతర అధికారులు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి కేసీఆర్‌ నిబద్ధతతో కృషిచేస్తున్నారు. ఇటీవలనే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలను పెంచటం బాధ్యతాయుత పాలన అందించటంలో భాగమే.

- Advertisement -

గ్రామాల సమగ్రాభివృద్ధే రాష్ర్టాభివృద్ధిగా చెప్పుకోవచ్చు. దీనికోసం గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించటం కోసం సీఎం అన్నిరకాల చర్యలు చేపట్టారు. మిషన్‌ కాకతీయ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను పునరుద్ధరించి ఆధునీకరించడం వల్ల కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులన్నీ జలకళతో కళకళలాడుతున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పంచాయతీలకు నిధులు క్రమం తప్పకుండా విడుదల చేయడమే కాకుండా మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నారు. పల్లెప్రగతి ద్వారా చేపడుతున్న పనులు గ్రామీ ణ వ్యవస్థ రూపురేఖలను మార్చేస్తున్నాయి. గ్రామాల్లో నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, శ్మశానవాటికలు ఏర్పాటుచేసి ప్రజల మౌలిక అవసరాలు తీరుస్తున్నారు. మొత్తంగా 6,224 పంచాయతీల్లో డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల పనులు ముమ్మరంగా జరుగుతున్నా యి. ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించారు. పచ్చదనం పరిశుభ్రతకు పెద్దపీట వేయడం తెలంగాణ పర్యావరణాన్ని పరిరక్షించే అతి ముఖ్యమైన పని జరుగుతున్నది.

సమగ్ర గ్రామీణాభివృద్ధి కోసం చేస్తున్న వినూత్న కార్యక్రమాలు గ్రామాల స్వరూపాన్నే మార్చుతున్నాయి. జీవనవిధానాన్ని పెంపొందించడంలో గ్రామీణ ఆర్థిక స్వయం పోషణ ఎంతో ప్రాధాన్యం కలది. అలాగే గ్రామీణ యువతీ యువకు లకు ఉపాధి కల్పనకు వీలుగా వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గ్రామీణ వ్యవసాయరంగాన్ని ఆధునిక యంత్రాలతో అనుసంధానం చేసి అభివృద్ధి చేయటం ద్వారా నిరుద్యోగాన్ని రూపుమాపటం సుసాధ్యం అవుతుంది. తద్వారా ఎక్కడివారికి అక్కడే జీవనోపాధి లభించి అన్నివిధాలా సమాజం సమగ్రాభివృద్ధి దిశగా సాగుతుంది.

డాక్టర్‌ రక్కిరెడ్డి ఆదిరెడ్డి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పల్లె వాకిట్లో ప్రగతి మేడలు
పల్లె వాకిట్లో ప్రగతి మేడలు
పల్లె వాకిట్లో ప్రగతి మేడలు

ట్రెండింగ్‌

Advertisement