e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home ఎడిట్‌ పేజీ తెలంగాణ దీప్తి

తెలంగాణ దీప్తి

తెలంగాణ దీప్తి

తెలగాణ సంస్కృతిన్‌ దీప్తిమంతము చేసి
ఆధిపత్యమ్మును అడ్డుకట్టె,
చైతన్యమును పెంచి జనుల జాగృతి చేసి
బంగారు కాంతుల రంగరించె,
తెలగాణ రాష్ట్రమ్ము తలలోని నాల్కయై
మార్గదర్శిగ నిల్వ మహిమ జూపె,
సాహితీ సంస్కృతుల్‌ సద్యశమ్మును గాంచ
పెద్ద పీటను వేసి విలువ బెంచె

మా నమస్తే తెలంగాణ మాతృభూమి
గౌరవమ్మును నిలుపుచు ఖ్యాతి గాంచె
ఈ దశాబ్ది మహోత్సవ హేలలందు
పాల్గొనంగను మీ కిదే స్వాగతమ్ము.

సాహితీ వనములో సంచార మొనరించి
కవి సింహముల పెంచి ఖ్యాతి గాంచి,
కమనీయ మహనీయ రమణీయ గణనీయ
కావ్య నాటకముల గణుతి బెంచి,
తులలేని మృషలేని వెలలేని యమృతత్వ
కార్యములకు నీడగాను నిలిచి
భిన్న స్వరంబంచు విన్నాణమును బెంచి
ప్రగతి కార్యమ్ముల బరగ జేసి
మా నమస్తే తెలంగాణ మహిత యౌచు
పెక్కు రాష్ట్రమ్ములందున పేరుగాంచె
మాన్య గుణులార! సద్యశో ధన్యులార!
స్వాగతాంజలి గొనుడయ్య జ్ఞానులార!

మద్దూరి రామమూర్తి
9989924675

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ దీప్తి

ట్రెండింగ్‌

Advertisement