e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home ఎడిట్‌ పేజీ ఎడబాసిన గువ్వలు

ఎడబాసిన గువ్వలు

ఎడబాసిన గువ్వలు

జైలులో మల్లెల పొదలు విరివిగా పెరుగుతాయి. పూవులు విరబూస్తాయి. కానీ వాటిని ఎవరూ తెంపడం గానీ, వాసనను ఆస్వాదించటం గానీ జరుగని సందర్భాలను చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఇది జైల్లో మగ్గుతున్న వారి మనస్తత్వానికి, నిరాశానిస్పృహలకు అద్దం పడుతుంది. (ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో మీసాచట్టం కింద అరెస్టు చేయబడి వరంగల్‌ జైలులో నిర్బంధంలో ఉన్న కాలంలో రాసిన కవిత)
జైలు మల్లెల పొదలు
పెరుగును వరుసగ
జీవన బందీలుగ
చూచును దిగులుగ

పూచినవీ పూవులు
పున్నమి సెగలుగ
దోచినవీ ఎదలను
కన్నీరు చిలుకగ ॥జైలు॥

చేసిన నేరగాథ
కలిచెను కటువుగ
చేయని నేరబాధ
కోరెను తగుపగ

ఎడబాసిన గువ్వల
ఇనుప పంజరం
రాకాసి హస్తాల
కారాగారం.. ॥జైలు॥

(వరంగల్‌ జైల్లో నాడున్న తెల్లని మల్లెల స్థానంలో ఇప్పుడు అక్కడ శ్వేతవస్ర్తాలతో తిరుగాడే వైద్యులు, నర్సులు ఉండే దవాఖానగా మారుతున్న సందర్భంగా..)

సీహెచ్‌. విద్యాసాగరరావు
(మహారాష్ట్ర మాజీ గవర్నర్‌)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎడబాసిన గువ్వలు

ట్రెండింగ్‌

Advertisement