e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎడిట్‌ పేజీ ప్రగతిశీలం లేదు, బహుజన భావం కాదు

ప్రగతిశీలం లేదు, బహుజన భావం కాదు

ప్రగతిశీలం లేదు, బహుజన భావం కాదు

సకల శాస్ర్తాలకు మాతృక సమాజం అయితే సమాజానికే మాతృక రాజకీయ అధికారం అయ్యింది. విలువలే విధిగా బతికేవారు కొందరుంటే, విలువలకు వలువలు విప్పేవాళ్లు మరికొందరు ఉంటారు. స్వీయ ప్రతిభ కన్నా, రాజకీయ అధికారంతో రాణించి వెలుగులోకి వచ్చారు ఈటల రాజేందర్‌. దాన్ని ఆయన తన స్వీయ ప్రతిభ అని భ్రమిస్తున్నారు.

నిజాయితీ యుద్ధంలాంటిదని తెలిసి కూడ, పేదరికంలో పుట్టి జీవితంలో సిద్ధాంతాన్ని ఆచరించి కాలాతీత వ్యక్తులుగా చరిత్రకు దర్పణంగా మిగిలినవారున్నారు. గుడెసెలో పుట్టి వేలాది కోట్లకు ఎదిగిన ఈటల బీజేపీలో చేరి ‘నా పుట్టుకే కమ్యూనిజం’ అంటున్నారు. రాజకీయం, వ్యాపారాన్ని కలగలిపి రెండు చేతులా వందలాది ఎకరాల భూములు ఆక్రమించి వేల కోట్లకు ఎదిగి, కమ్యూనిజం పేరు చెప్పడం హస్యాస్పదమే. మార్క్స్‌ని హెడ్గేవార్‌లో చూస్తారేమో! బ్రాహ్మణ బనియా పార్టీగా పేరున్న బీజేపీ బీసీలకు వ్యతిరేకమని మండల్‌ కమిషన్‌తోనే తేలిపోయింది. జనాభాలో ఒక్క శాతం ఉన్న సామాజిక వర్గానికి కేంద్ర మంత్రివర్గంలో 18 మంది ఉండగా, దేశ పాలనారంగంలో బలహీన వర్గాలు కానివారే 97 శాతం ఉన్నారు. అటువంటి బీజేపీ ఆయనకు ప్రశ్నించే గొంతుకగా, ఆత్మగౌరవ ప్రతినిధిగా కనిపించి అందులో చేరబోతున్నారు.

రైతు ఉద్యమం, కరోనా తదితర కారణాలతో బీజేపీ కీర్తి మసకబారుతున్న తరుణం. బీజేపీ ఎప్పుడూ విషయం లేకుండానే వివాదం సృష్టించి దాన్ని ప్రచార అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. తన అవసరం కోసం రెండు భావ వైరుధ్యాలను కలిపేస్తూ బ్రాయిలర్‌ కోళ్ళ బరువుకోసం స్టెరాయిడ్స్‌ ఎక్కించినంత తేలికగా మాట్లాడి, కాషాయంలో కమ్యూనిజం చూడాలనుకుంటున్నారు ఈటల.

ఈటలలో రెండు కోణాలు స్పష్టమౌతున్నాయి. రాజకీయనాయకుడి కోణం కన్నా వ్యాపార కోణమే పెద్దదిగా కనబడుతున్నది. ఎకరం 10 కోట్లు పలికే 200 ఎకరాలు ఉన్నాయని ఈటలే స్వయంగా ప్రటించారు. అది కాకుండా మరో వెయ్యి ఎకరాలు బినామీ పేర్లతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఆరోపణల తర్వాత ఆయన ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు. ప్రాణాన్నైనా వదులుకుంటాను కాని ఆత్మగౌరవాన్ని వదులుకోనని
పెద్దమాటలు చెప్తున్నారు. ఆయన అది ఎక్కడ కోల్పోయారో మాత్రం చెప్పలేకపోయారు

ఫ్రెంచి పొలిటికల్‌ ఫిలాసఫర్‌ ‘కంచె వేసేకాడే పంచాయితీ మొదలౌతుంది’ అంటాడు. పేదల భూములు ఆక్రమించుకున్నారనే ఆరోపణలతోనే మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్‌ అయ్యారు. బలహీనవర్గాల భూములు ఆక్రమించారన్న ఆరోపణల తర్వాత ఈటలలో రెండు కోణాలు స్పష్టమౌతున్నాయి. రాజకీయనాయకుడి కోణం కన్నా వ్యాపార కోణమే పెద్దదిగా కనబడుతున్నది. ఎకరం 10 కోట్లు పలికే 200 ఎకరాలున్నాయని ఈటలే స్వయంగా ప్రకటించారు. అది కాకుండా మరో వెయ్యి ఎకరాలు బినామీ పేర్లతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఆరోపణల తర్వాత ఆయన ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు. ప్రాణాన్నైనా వదులుకుంటాను కాని ఆత్మగౌరవాన్ని వదులుకోనని పెద్దమాటలు చెప్తున్నారు. ఆయన అది ఎక్కడ కోల్పోయారో మాత్రం చెప్పలేకపోయారు.

తెలంగాణ ఆత్మగౌరవమంటే ముఖ్యమంత్రి కే చంద్రరశేఖరరావు గుర్తొస్తారు. ఇది ఎవరూ కాదనలేని విషయం. ప్రజల మనోఫలకాల మీదనుంచి తీసెయ్యలేని అంశం. తెలంగాణలో మంత్రి కావడం అంటే 25 లక్షలమందిలో ఒక్కరికి దక్కే అరుదైన అవకాశం. ప్రశ్నించే గొంతుకలుండాలి, గులాబీ జెండాలకు ఓనర్లం, పాలకులకు మెరిట్‌ ఉండాలి అన్న ఈటల, తన ఇంట్లోనే తనకు మెరిట్‌ కోల్పోయారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబందు పథకం దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నది. ఈ పథక ప్రారంభ కార్యక్రమం హుజురాబాద్‌లో మొదలైనప్పుడు పొగిడి తర్వాత విమర్శించడాన్ని, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్‌ ఖండించారు. ఈటల పార్టీ మారడం వెనుక ఆస్తుల రక్షణ, ఆత్మవంచన, అవకాశ వాదమే కనబడుతున్నది కానీ, ఆత్మగౌరవం ఎక్కడా లేదు.

ఏ సంస్థ అయినా, పార్టీఅయి నా, ప్రభుత్వం అయినా అంతర్గ త విషయాలను బహిరంగ వేదికలపై చర్చించకూడదనే నిబంధన పాటిస్తారు. ఈటల రాజేందర్‌ను కేసీఆర్‌ ఎక్కువ కాలమే భరించారని టీఆర్‌ఎస్‌ వాదుల వాదన. డబ్బు, పేరు ప్రఖ్యాతులు పెరిగే కొద్దీ కొంతమంది మాత్రమే సమాజంలో సమతూకంగా వ్యవహరిస్తారు. ఈ సమతూకం దెబ్బతినడం వల్లనే రాజకీయంగా ఈటలకు ఈ పరిస్థితి ఏర్పడింది.

గులాబీ జెండాకు ఓనర్లమని ప్రకటించి, కిరాయిదారునిగానే బయటకెళ్ళిన రాజేందర్‌ బీజేపీలో ఆత్మగౌరవ పతాకగా ఉంటారో, భంగపడి బయటికి వస్తారో కాలమే చెబుతుంది. గతంలో ఇలాగే ఇతర పార్టీలనుంచి బీజేపీలో చేరినవారి స్థితి ఏమైందో చరిత్ర సాక్ష్యంగానే ఉన్నది. దానికి ఈటల మినహాయింపేమీ కాదు.
( వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌)

సాధం వెంకట్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రగతిశీలం లేదు, బహుజన భావం కాదు

ట్రెండింగ్‌

Advertisement