ఆత్మగౌరవ పోరాటంలోంచి ఆవిర్భవించిన తెలంగాణ స్వయంకృషితో వెలుగులీనుతున్నది. రాష్ట్రసాధన ఉద్యమకాలంలో అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి పోరాటంలో దూకిన కేటీఆర్ స్వయంకృషికి,ప్రతిభకు ప్రతీకగా నిలిచారు.
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో శ్రీరామునికి హనుమంతుడిలా కొండంత అండగా నిలిచిన యువతరం ఆదర్శ నేత కేటీఆర్. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే తిరుగులేని రాజకీయ నాయకుడిగా, వ్యూహకర్తగా, పార్టీని విజయ పథంలో నడిపించే యువనేతగా కేటీఆర్ ఎదగడం అసాధారణం. కఠోర పరిశ్రమ, నైపుణ్యం, పథక రచన, నిబద్ధత ఉంటే తప్ప ఈ ఎదుగుదల సాధ్యం కాదు. తండ్రికి తగిన పాలనాదక్ష వారసుడని భరోసా ప్రజల్లో కల్పించారు.
టీఆర్ఎస్ ఆవిర్భవించే కాలానికి కేటీఆర్ ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి భవిష్యత్తు ఉన్నా, తన మాతృభూమి తెలంగాణ అతన్ని అక్కడ ఉండనీయలేదు. తెలంగాణ తల్లి విముక్తి కోసం అమెరికాను వదిలి హైదరాబాద్ వచ్చారు. ప్రజలతో కలసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యం, ఉద్యమం అన్ని దశల్లోనూ పోషించిన కీలక పాత్ర కేటీఆర్‌ను ఒక ఆదర్శ యువనేతగా తీర్చిదిద్దాయి. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికే వన్నె తెచ్చి తండ్రి బాటలో నడుస్తున్న యువనేత కేటీఆర్.
రాష్ట్ర మంత్రిగానే కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టీఆర్ఎస్ను బలోపేతం చేశారు కేటీఆర్. తెలంగాణను ఫార్మా హబ్‌గా మార్చడంలో కేటీఆర్ కృషి అద్వితీయం. నిరంతరం ప్రజలతో ఉంటూ కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు అండగా నిలిచిన ప్రజల మనిషి కేటీఆర్. ఐటీ, గుడ్ గవర్నెన్స్ లాం టి అనేక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో కేటీఆర్ పొందారు. ఆయన సేవా భావం, తక్షణ స్పందన కేటీఆర్‌ను తెలంగాణకు భవిష్యత్ ఆశాజ్యోతిగా నిలబెడుతున్నాయి. కేటీఆర్ మరెన్నో జన్మదినాలను జరుపుకోవాలని ఆశిస్తూ..యువనేతకు జన్మదిన శుభాకాంక్షలతో..
–గోసుల శ్రీనివాస్ యాదవ్