e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home ఎడిట్‌ పేజీ నినాదాలు నిజం కావాలె

నినాదాలు నిజం కావాలె

భారత స్వాతంత్య్రానికి 74 ఏండ్లు నిండి 75వ సంవత్సరం ప్రారంభమైంది. స్వాతంత్య్ర అమృతోత్సవం దేశమంతటా ఘనంగా జరగాలన్న ఆకాంక్ష, అభిలాష బలంగా వ్యక్తమైనాయి. ఉద్దేశం మంచిదే. కానీ, అమృతోత్సవం జరగవలసిన సమయాన దేశమంతటా కాశ్మీర్‌ నుంచి కేరళ దాకా కరోనా మహమ్మారి మృత్యు కుహరంలో ఇరుక్కున్న లక్షలాది మంది హాహాకారాలు, ఆర్తనాదాలు విన్పిస్తున్నాయి. కరోనా విపరీతంగా ఆహారోత్సవం జరుపుకుంటున్నది. అందరి నినాదాలు నిజం కావు.

నినాదాలు నిజం కావాలె

అచ్ఛేదిన్‌ ప్రచారం జరుగుతుండగానే కరోనా మహమ్మారి వచ్చింది, కాటేసింది. 2020 ఫిబ్రవరిలో మోదీజీ ప్రియ మిత్రుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అహ్మదాబాద్‌ వచ్చినప్పుడు ఆయన వెంట ప్రత్యేక విమానంలో కరోనా వచ్చిందని, ఇక్కడే స్థిరపడిందని కొందరు అంటున్నారు. చప్పట్లకు భయపడి కరోనా పారిపోతుందని, అచ్ఛేదిన్‌ నిరాటంకంగా కొనసాగుతాయని అతి ఆశావాదులు భ్రమించారు. ఏమైనా.. కరోనా ఏకు మేకయి ఇక్కడ వేలాది ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంటూ భయంకరంగా విజృంభిస్తున్నదన్న వాస్తవాన్ని గుర్తించక తప్పదు.

కేసీఆర్‌ 20 ఏండ్ల కిందట ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్‌ చచ్చుడో’ (గాంధీజీ ‘డు ఆర్‌ డై’ నినాదం వలె) అన్న నినాదం ఇచ్చారు. అంతకుముందు 60 ఏండ్లలో ఎవరికీ సాధ్యం కాని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య మార్గంలో ఉద్యమిస్తున్నప్పుడే ఆయన ‘బంగారు తెలంగాణ’ నినాదం ఇచ్చారు. స్వయంగా బాధ్యత వహించి (నినాదాలు ఇచ్చి పలాయన మంత్రం పఠించకుండా) గత ఏడేండ్ల నుంచి బంగారు తెలంగాణ నిర్మాణ బృహత్తర యజ్ఞం నిర్వహిస్తున్నారు కేసీఆర్‌. కేంద్రంలోని ఒక తెలంగాణ మంత్రికి కేసీఆర్‌ బంగారు తెలంగాణ నిర్మాణంలో కుంభకోణాలు మాత్రమే కన్పిస్తున్నాయి.. కంస రాక్షసుడికి అడుగడుగున, ప్రతి అంగుళంలో శ్రీకృష్ణ భగవానుడే కన్పించినట్లు. దుష్ట శిక్షణ కోసమే, ఎందరు కంసులు అడ్డుపడినా శ్రీకృష్ణ భగవానుడు ఈ భువి మీద అవతరించారు. వేదవ్యాస ప్రోక్త సంస్కృత మహాభారతంలో లక్ష శ్లోకాలున్నాయి. ఈ లక్ష శ్లోకాలలో కురుక్షేత్ర రణరంగాన శ్రీకృష్ణ భగవానుడు అర్జున విషాద యోగాన్ని తరిమివేయడానికి ప్రవచించిన ఉపనిషత్తుల సారమైన భగవద్గీత మాత్రమే ప్రపంచమంతటా అన్ని భాషల వారిని అలరించింది. కర్తవ్య బోధన జరిపింది. ఆంగ్లంలోకి ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ అనువదించిన భగవద్గీతను చదివే గాంధీజీ ప్రభావితుడైనాడు. పోరాట మార్గంలో నడిచాడు. లోకల్‌ కంసులు ఎందరు అడ్డుపడినా, ఎందరు ఎన్ని అప్రాచ్యపు మాటలు మాట్లాడినా మహానేత నేతృత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం కొనసాగి తీరుతుంది. అది తెలంగాణ ప్రజలు నోచిన నోము. అందరి నినాదాలు నిజం కావు. కొందరి నినాదాలు నిరర్ధకమవుతాయి.

ఏడున్నర ఏండ్ల కిందట దేశమంతట అధికారం చేపట్టినవారు ‘ఇక అచ్ఛేదిన్‌ వచ్చాయి’ అన్నారు. ప్రతి ఒకరి బ్యాంకు అకౌంట్‌లో రూ.15 లక్షలు జమ కాబోతున్నాయని, ఇక పండుగ చేసుకోవాలని ఊరించారు. ఏటా కోటి ఉద్యోగాలు ఖాయమని జో కొట్టారు. మిత్రుడు యాదగిరి అన్నట్లు అచ్ఛేదిన్‌ బదులు చచ్చేదిన్‌ వచ్చాయన్పిస్తున్నది! పుల్వామా దాడిలో 40 మంది భారత పోలీసు యోధులు హతమారిన తర్వాత రహస్యంగా సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరపడంతో, నోట్ల రద్దుతో అచ్ఛేదిన్‌ వచ్చాయన్నారు! హిమాలయ పర్వతాల సరిహద్దుల్లో చైనా ఆక్రమించిన భూ భాగాలను స్వాధీనం చేసుకోవడంతో (ఆక్రమించిన భూ భాగాలను చైనా వదిలిపెట్టలేదన్నది కొందరి అభిప్రాయం) అచ్ఛేదిన్‌ వచ్చాయన్న ప్రచారం జోరుగా సాగింది. అచ్ఛేదిన్‌ ప్రచారం జరుగుతుండగానే కరోనా మహమ్మారి వచ్చింది, కాటేసింది. 2020 ఫిబ్రవరిలో మోదీజీ ప్రియ మిత్రుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అహ్మదాబాద్‌ వచ్చినప్పుడు ఆయన వెంట ప్రత్యేక విమానంలో కరోనా వచ్చిందని, ఇక్కడే స్థిరపడిందని కొందరు అంటున్నారు. చప్పట్లకు భయపడి కరోనా పారిపోతుందని, అచ్ఛేదిన్‌ నిరాటంకంగా కొనసాగుతాయని అతి ఆశావాదులు భ్రమించారు. ఏమైనా.. కరోనా ఏకు మేకయి ఇక్కడ వేలాది ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంటూ భయంకరంగా విజృంభిస్తున్నదన్న వాస్తవాన్ని గుర్తించక తప్పదు. వ్యాక్సిన్‌లు, ఆక్సిజన్‌, పడకలు, డాక్టర్లు లేకపోవడంతో క్షణక్షణం దేశమంతట యముని మహిషపు లోహ ఘంటలు విన్పిస్తున్న పరిస్థితుల్లో, భారత ప్రధాని మోదీ ‘టీకా ఉత్సవ్‌’ జరుపుకోవాలని కొత్త నినాదం ఇచ్చారు!

కరోనా ప్రళయ తాండవం ఇక మన ‘అంతర్గత సమస్య’గా మిగిలి లేదు. ప్రపంచమంతా మన కోసం ఈరోజు విలపిస్తున్నది.. ‘అయ్యో భారత దేశం’ అంటూ. అన్ని దేశాలు మనకు అండగా నిలవడానికి ముందుకొస్తున్నాయి. ప్రపంచాన్ని మనం ఆదుకుంటున్నామన్న మాట వట్టి బూటకమని రుజువైంది. అయినా మన భేషజం తగ్గడం లేదు. కరోనాను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి అందించాలనుకుంటున్న సహాయాన్ని భారత ప్రభు త్వం నిరాకరించిందని ఒక వార్త! ఒక వంక మొత్తం దేశాన్ని కరోనా కబళిస్తున్నా ప్రధానమంత్రి మోదీజీ, దేశ వ్యవహారాల మం త్రి అమిత్‌ షా ఎన్నికల కోసం (ముఖ్యంగా బెంగాల్‌ ఎన్నికల కోసం) యమ యాతనపడ్డారు. చివరికి మిగిలింది శూన్యం. బెంగాల్‌ ఇవాళ చెప్పింది రేపు దేశం చెప్పుతుందన్న మాట నిజం కాబోతున్నదా..? నిజమైతే నిజంగానే మంచి రోజులొస్తాయి సందేహం లేదు.

దేవులపల్లి ప్రభాకర రావు

Advertisement
నినాదాలు నిజం కావాలె
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement