e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home ఎడిట్‌ పేజీ సమాచారమే విజయ సోపానం

సమాచారమే విజయ సోపానం

నేటి పోటీతత్వ సమాజంలో మనిషి తనంతట తానుగా నిలదొక్కుకోవటానికి కావలసినది గోరంత విలువైన సమాచారం. కానీ నేడు దొరుకుతున్నది కొండంత విలువలేని సమాచారం. సమాచార ఆవశ్యకతకు సంబంధించి ‘నెట్‌వర్క్‌ ఈజ్‌ నెట్‌వర్త్‌’ అనే నూతన ఒరవడిని సూపర్‌ హబ్స్‌ పుస్తకంలో రచయిత డాక్టర్‌ సాండ్రా నావిడి విశదీకరించారు. నెట్‌వర్క్‌ ద్వారా వచ్చే విలువైన సమాచారం ఆ వ్యక్తిని ఏ విధంగా సంపన్నుడిని చేస్తుందో తెలియపరచారు.

నేడు సామాజిక మాధ్యమాలు గుట్టలుగా విలు వ లేని సమాచారాన్ని చేరవేస్తున్నాయి. ఈ చేరవేతలతో ఆయా సంస్థలు తమ సంపద విలువను రెట్టింపు చేసుకుంటున్నాయి. ‘హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌’ అని మరిచి ‘ఇన్ఫర్మేషన్‌ ఈజ్‌ వెల్త్‌’ అనే విధంగా ఆయా కంపెనీలు అనవసర సమాచారాన్ని చేరవేస్తూ వాటి కి లైకులతో చక్కర్లు కొట్టిస్తున్నాయి. కరోనా వల్ల లాభపడ్డవి ఇలాంటి సామాజిక మాధ్యమ సంస్థలే.

- Advertisement -

విలువైన సంపదను సృష్టించే సమాచారం సామాజిక మాధ్యమాలైన ట్విటర్‌లో ట్వీట్‌ అవ్వ దు, ఫేస్‌బుక్‌లో పోస్టవ్వదు. మొన్నటికి మొన్న ఒక ప్రముఖ ఐటీ కంపెనీ కో ఫౌండర్‌ వంద కోట్ల పెట్టుబడితో అదే కంపెనీ వాటాలను కొనుగోలు చేశాడు. ఆ మర్నాడు ఐటీ రంగ హెచ్‌1 -బీ వీసాలపై సానుకూల వార్త వెలువడటంతో ఐటీ కంపెనీల షేర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ముందస్తు సమాచారం ఎంత విలువైందో దీనిని బట్టి తెలుస్తున్నది.

సమాచారమే విజయ సోపానం

విలువైన సమాచారానికి కావలసిన నెట్‌వర్క్‌ పిరమిడ్‌ ఆకారంలో పై అంచున ఉండే ఐదు శాతం ప్రజానీకానికి మాత్రమే లభ్యమవుతున్నది. వివిధ కంపెనీలు, కొత్త ప్రాజెక్టులు, రాజకీయాంశాలు, రెగ్యులేషన్స్‌, పన్నుల్లో వచ్చే మార్పుచేర్పులు, ప్రోత్సాహకాలు తదితర సమాచారం హై నెట్‌వర్క్‌ పుణ్యమాని సంపన్ను లకే అందుతున్నది. సామాన్యుడికి అందుబాటులో ఉండటం లేదు.

విలువైన సంపదను సృష్టించే సమాచారం సామాజిక మాధ్యమాలైన ట్విటర్‌లో ట్వీట్‌ అవ్వ దు, ఫేస్‌బుక్‌లో పోస్టవ్వదు. ఒకవేళ ట్వీట్‌ అయి నా ఆ వార్త ఉపయోగం ఎన్నటికీ ఉండదు. మొన్నటికి మొన్న ఒక ప్రముఖ ఐటీ కంపెనీ కో ఫౌండర్‌ వంద కోట్ల పెట్టుబడితో అదే కంపెనీ వాటాలను కొనుగోలు చేశాడు. ఆ మర్నాడు ఐటీ రంగ హెచ్‌1 -బీ వీసాలపై సానుకూల వార్త వెలువడటంతో ఐటీ కంపెనీల షేర్ల ధరలు గణనీయంగా పెరిగా యి. ముందస్తు సమాచారం ఎంత విలువైందో దీనిని బట్టి తెలుస్తున్నది. భూత భవిష్యత్‌ వర్తమానాల్లో సమాచారానికి ఎన్నడూ లాక్‌డౌన్‌ ఉండదు. నేటి యూట్యూబ్‌ ఛానెల్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో అవసరమైన, అవసరం లేని సమాచారం నిరంతరాయంగా రావడం వల్ల ప్రజల అమూల్యమైన సమయం, ఆర్థిక వనరులు వృథా అవుతున్నాయి. నేడు సాంకేతికత గణనీయంగా అభివృద్ధి చెందడంతో మనిషి తనకు అన్నీ తెలుసునని గర్వించాడు. కానీ మందు లేని మాయరోగానికి తలదించి, మరొక అద్భుత శక్తి కోసం ఎదురుచూస్తున్నాడు. అలాగే నేటి సామాజిక మాధ్యమాలు నవ యువతరానికి ఉపయోగపడకపోయినా ఫరవాలేదు కానీ వారిని పెడదారి పట్టించకూడదు.

నేడు సామాజిక మాధ్యమాలు గుట్టలుగా విలు వ లేని సమాచారాన్ని చేరవేస్తున్నాయి. ఈ చేరవేతలతో ఆయా సంస్థలు తమ సంపద విలువను రెట్టింపు చేసుకుంటున్నాయి. ‘హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌’ అని మరిచి ‘ఇన్ఫర్మేషన్‌ ఈజ్‌ వెల్త్‌’ అనే విధంగా ఆయా కంపెనీలు అనవసర సమాచారాన్ని చేరవేస్తూ వాటి కి లైకులతో చక్కర్లు కొట్టిస్తున్నాయి. కరోనా వల్ల లాభపడ్డవి ఇలాంటి సామాజిక మాధ్యమ సంస్థలే. లాక్‌డౌన్‌ మూలంగా ఈ సంస్థలు అనేకానేక కొత్త చందా దారులను చేర్చుకొని సంపదను వృద్ధిబాటన పట్టించాయి. వీటి మూలంగా టెలికాం సంస్థలు కూడా లాభాల బాట పడుతున్నాయి. ఈ సామాజిక మాధ్యమాలను కొందరు విద్య, ఉపాధి కోసం, నైపుణ్యాభివృద్ధికి వినియోగించుకోవడం హర్షణీయం.

ఓ సాధారణ మనిషి సమాజంలో నిలదొక్కుకొని స్థిరపడి ఎదగాలంటే కావలసినది విలువైన మాట సహాయం. ఒక విద్యార్థి తన క్లాస్‌ టీచర్‌ను అడిగి తన కెరీర్‌ నిర్దేశించుకుంటా డు. సగటు మధ్యతరగతి ఉద్యోగి తన సహోద్యోగినో లేదా మెంటార్‌ బాస్‌నో అడిగి కెరీర్‌ ప్రోగ్రెస్‌ వైపు అడుగులు వేస్తుంటాడు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి నుంచి కావలసిన సమాచారాన్ని సేకరిస్తాడు. వీరందరూ కావలసిన వారికి చేరవేస్తున్నది విలువైన సమాచారమే. కాకపోతే ఈ సమాచారం అనుభవ పూర్వకమైనది, వాస్తవికమైనది, అమూల్యమైనది. కానీ నేటి యువత సర్వం గూగుల్‌ అని జపిస్తూ అందులో వచ్చే సమాచారానికి అత్యంత విలువ ఇచ్చి తనకే అంతా తెలుసుననే ఊహాలోకంలో విహరిస్తున్నారు. అడ్డూ అదుపు లేని ఈ వినియోగం మనిషి పరిపక్వతను, అద్భుతమైన తెలివితేటలను మందగింప జేస్తున్నది.

అనిశ్చిత, ఆకస్మిక ఘటనల నుంచి, అపజయాల నుంచి విజయం సాధించేందుకు సమాచారాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చునో ‘దృశ్యం-2’ అనే మలయాళ సినిమాలో చక్కగా చూపా రు. సమాచార ప్రాముఖ్యాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. విలువలేని కొండం త సమాచారం కన్నా విలువైన గోరంత సమాచారమే మిన్న.
వ్యాసకర్త: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌

డాక్టర్‌ ఎం.చంద్రశేఖర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సమాచారమే విజయ సోపానం
సమాచారమే విజయ సోపానం
సమాచారమే విజయ సోపానం

ట్రెండింగ్‌

Advertisement