అక్షరాలు
ఆధిపత్యాలకు
పూలదండలైతున్న కాలం
కలాలు
కుతంత్రాలకు గొడుగులు పడ్తున్న కాలంలో
దక్కన్ నేలపై మొలిచిన
అస్తిత్వపు అగ్నిధార
నమస్తే తెలంగాణ !
తలకు టోపి ఎవరు ధరిస్తరో
వారే క్యాప్టెన్గా
ప్రకటించుకున్నరు
కానీ.. ప్రజలు ప్రకటించుకున్న క్యాప్టెన్
నమస్తే తెలంగాణ !
అన్నింట్ల అక్షరాలు
ఆకాశంనుంచి రాలుతే
భూమిపై అక్షరాలు
నమస్తే తెలంగాణలో
ప్రజలను నక్షత్రాలను చేసిన
నమస్తే తెలంగాణకు
సమస్త ప్రజలు నమస్కరిస్తున్నరు
మీడియా అంటే
వాడికి వీడికి కిరీటం కాదు
మీడియా అంటే ప్రజల నాడి
మలీద మట్కిళ్లు తంగేడుపూలపరిమళాలు
సద్దులబతుకమ్మ వాయినాలు
అలాయిబలాయిల అగ్గిపూల పాటలు
ప్రతివాక్యం అమరుల స్వప్నాలు
యాస భాషల జీవగొంతు నమస్తే తెలంగాణ!
కలసాకారానికై కదంతొక్కిన
సబ్బండ వర్ణాల గొంతుక నమస్తే తెలంగాణ!
మహోద్యమానికీ దశదిశ నిర్దేశంతో
స్వపరిపాలన ధిక్కారాలు
పలుకుబడులు నుడికారాలు జాతీయాలతో
తెలంగాణ తేజస్సును ప్రపంచానికి ఎరుకచేసిన అక్షర సింగిడి
రైతన్నల గుండెసవ్వడిని
రాసిపోసిన కల్లం
ఎత్తిపొడుపులకు
ఎత్తిపోతలే సమధానంగా
చీకట్లను తరిమి
వెన్నెలకు ప్రాణం పోసిన సంపాదకీయాలు
కరోనా కదంతొక్కినా
గుండెనిండుగా
ఇమ్మతు పెంచిన ధైర్యాలు
మాయామర్మాల మబ్బులను పల్గచీరుతూ
ఆత్మగౌరవానికీ పొత్తిలి పరిచిన
అమ్మ ఒడి నమస్తే తెలంగాణ !
కవన చెలిమెలు కథలవిశ్లేషణలు
అవిరేను కుండమీద పాలకొమ్మలా ఆదివారం బతుకమ్మ
వెన్నెల వెలుగుల జిందగీలు
మనబొట్టు బోనం సంస్కృతి
అస్తిత్వాన్ని అజేయం చేసిన చారిత్రక చార్మినార్ నమస్తే తెలంగాణ
పదేళ్ల నమస్తే తెలంగాణకు శనార్థులు
వనపట్ల సుబ్బయ్య
9492765358