ఎండకాలమందు ఎగువ మానేరులో
నిండె నీరు అరయ వేడుకయ్యె
మండుటెండలలోన మత్తడి దుముకులు
ప్రాజెక్టు చరితలో ప్రథమమిపుడు
ఎచటి కాళేశ్వరమ్మెచటిది గోదారి
ఎదురెక్కి వచ్చెను ఏమి వింత?
కూడెల్లి వాగులో కూర్మితో ప్రవహించి
చేరె గోదారి మానేరునకును
కొండపోచమ్మలో గోదావరి జలాలు
హల్దివాగును దాటి అరుగు దెంచి
మరల మంజీరకు మరలియు జలసిరి
సాగిపోయెను నిజాం సాగరముకు
చెక్డ్యాములను, మరి చెరువులెన్నో నింపె
హల్ది కూడెల్లియు హర్షమొదవ
వలస పాలనలోన వంచింపబడితిమి
స్వంత రాష్ట్రమునందు సాధ్యపడెను
ముందుముందు నా తెలంగాణమందు వేగ
పూర్తి యగును ప్రాజెక్టులు ఆర్తి దొలగు
మాన్యులైనట్టి మన ముఖ్యమంత్రి మేటి
కోటి ఎకరాల మాగాణి మాట నిజము
స్వంత రాష్ట్రమప్పుడు సౌభాగ్య సీమయై
పంట సిరులతోడ పరిఢవిల్లు
బంగరు తెలంగాణ బహదూరమున లేదు
నవ్యపథము నందు నడచివచ్చు.
జక్కని వేంకటరాజం, 94400 21734