e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home ఎడిట్‌ పేజీ వృత్తి పారిశ్రామిక విప్లవం

వృత్తి పారిశ్రామిక విప్లవం

భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది. గ్రామాల్లోనే డబ్బుశైతంపైగా జనం ఉన్నారు. గ్రామాల్లో ప్రధాన ఆదాయ వనరులు వృత్తులు. ఈ వృత్తిపనుల ద్వారా ఆదాయం సమృద్ధిగా ఉన్నప్పుడే గ్రామాలు, తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది. వృత్తి పనులపై వచ్చేఆదాయంతో పాటు పరిశ్రమలద్వారా వచ్చే ఆదాయంతో దేశ,రాష్ట్ర ఆదాయమార్గాలు విశాలమవుతాయి. ఇవి రెండూ సమృద్ధిగా ఉన్నప్పుడే జనానికి చేతినిండా పని లభిస్తుంది. పారిశ్రామిక విప్లవం, యాంత్రీకరణ జరిగిన తర్వాత దేశంలో వృత్తిపనులవారు క్రమంగా తమ ఆదాయ మార్గాలను కోల్పోయారు. అన్నివృత్తులు సంక్షోభంలో పడి ప్రధాన ఆదాయవనరు, వృత్తి అయిన వ్యవసాయం కూడా సంక్షోభంలో పడింది. వృత్తి పనుల అభివృద్ధే దేశాభివృద్ధి.

గ్రామీణ ఆదాయ మార్గాలను పెంచడమంటే వృత్తిపరమైన ఆదాయ మార్గాలను విశాలం చేయడం. వృత్తులను బలోపేతం చేయడంతో పాటు వాటిని పరిశ్రమలుగా మార్చడం. ఇంతవరకు సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న వృత్తిపనులను ఆధునికీకరించి వాటిని లాభసాటి పనులుగా మార్చడమే వృత్తులను పారిశ్రామీకరించడమవుతుంది.

వృత్తి పారిశ్రామిక విప్లవం

సీమాంధ్ర వలస పాలకులు తెలంగాణను అన్నివిధాలుగా వివక్షకు గురిచేసినట్టే వృత్తిపనులను కూడా నిర్లక్ష్యం చేశారు. దీంతో చేనేత కార్మికులు, చిన్నరైతులు ఆత్మహత్యలు చేసుకొనేదాకా వెళ్లింది. వివిధ వృత్తిపనులవారు పనులను కోల్పోయి వలసలు ఎక్కువయ్యాయి. కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన దృష్టిని ప్రధానంగా గ్రామాలపైకి మళ్లించింది.గ్రామాలను అభివృద్ధి చేయకుండా ఆదాయ మార్గాలను పెంచడం గానీ, గ్రామీణుల సమస్యలు తీరడంకానీ సాధ్యం కాదని, గ్రామ మూలాలెరిగిన కేసీఆర్‌కు తెలుసు. వృత్తులను, పరిశ్రమలను సమన్వయం చేయ డం ఈ ఆరేడేండ్లలో విజయవంతంగా ముగించి తెలంగాణలో వృత్తి పారిశ్రామిక విప్లవం సాధించే దిశలో మన ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. అందులో భాగమే తెలంగాణలో వ్యవసాయక విప్లవం సాధించడం.

వ్యవసాయాన్ని వృత్తిగా భావించిన వాళ్ళు తెలంగాణలో కాని దేశంలోకాని ఏ ఒక్క కులానికో చెందిన వారు కాదు. వ్యవసాయ విప్లవం వల్ల గ్రామాల్లోని అనేక కులాల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అందుకే దండగన్న వ్యవసాయాన్ని పండుగగా మార్చడానికి కేసీఆర్‌ అనేక పథక రచనలు చేశారు. అందులో భాగమే కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యాని కల్పించారు. నీటివసతి లేకుం టే ఎంత భూములున్నా వృథాయే. అందుకే కాళేశ్వరం లాంటి బృహత్‌ ప్రాజెక్టును, దాని అనుబంధ ప్రొజెక్టులను పూర్తిచేసే దిశలో ఉన్నారు. దీంతో ఇప్పటికే తెలంగాణ జిల్లాలన్నీ జలకళతో కళకళలాడుతున్నాయి. ఎండాకాలం లోనూ చెర్లు, కుంటలు నిండి మత్తల్లు దుంకుతున్నాయి. రాష్ట్రమంతటా కాళేశ్వరం ప్రాజెక్టునీళ్లు పారటం వల్ల భూగర్భ జలాలు కూడా పెరుగు తున్నాయి. రైతుకు పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకంతో వచ్చేడబ్బు, పండిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడంద్వారా దళారి బెడద తప్పి వ్యవసాయం పండుగగా మారింది. హరితహారంతో గ్రామాల్లో పచ్చదనమీనుతుంది. రైతుకు ఉచిత కరంటు, పంటల మార్పిడి, ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారింది. ఇంతకు ముందు వ్యవసాయాన్ని వదిలిపెట్టి వెళ్ళినవాళ్ళు, సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలు చేసుకొనే వాళ్ళు కూడా వ్యవసా యం చేస్తున్నారంటే వ్యవసాయానికి పారిశ్రామిక లక్షణాలు వస్తున్నట్టేకదా! పరిశ్రమల్లో ఉండే లాభం, లక్షణం వ్యవసాయానికి కూడా రావడం తెలంగాణ సాధించిన సాధిస్తున్న వ్యవసాయక విప్లవం అనడంలో సందేహం లేదు.

ఇప్పటికే నాలుగు లక్షల గొల్ల కుర్మల కుటుంబాలకు గొర్రెలను, మేకలను ఇవ్వ డం ద్వారా గొర్రెల పెంపకాన్ని పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లారు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా గొర్రెల పెంపకం ఫాం హౌజులో పెంచడంగా, పరిశ్రమగా అభివృద్ధి చెందింది. మాంసాన్ని ఇతర దేశాలకు ఎగుమతి, ఉన్నిపరిశ్రమ అభివృద్ధి చెందుతున్నది. గొర్రె లు, మేకలు, బర్రెలు, ఆవుల పెంపకం ద్వారా క్షీరవిప్లవం సాధించే దిశలో తెలంగాణ ఉన్నది. పాలు, ఊన్ని మాం సంతోనూ, క్షీరవిప్లవంద్వారాను లక్షల మందికి ఆదాయాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం జానపద కళాకారులను, వృత్తి కళాకారులను, ఆశ్రిత కుల కళాకారులను ఆదరిస్తున్నది. జానపద, గ్రామీణ కళాకారులకు నెల జీతం ఏర్పా టు చేయడం ద్వారా అవి పునరుజ్జీవం పొందే అవకాశాలు మెరుగయ్యాయి. వేలమందికి ఉపాధి లభిస్తున్నది. గ్రామీణ జానపదకళలోఉన్న నేటివిటీ ద్వారా తెలంగాణీయత బతుకుతుంది.

చెర్లు, కుంటలు ఇతర జలాశయాల్లో
చేపవిత్తనాలు, వేసి చేపల పెంపకానికి పరిశ్రమ స్థాయి కల్పించింది. అలాగే గౌండ్ల కలాలివృత్తిని పెంచి పోషించి తాళ్ల, ఈదుల్లలోంచి వచ్చే ‘నీరా’ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతున్నది. బట్టలుతికే వృత్తి వారికి ధోబిఘాట్‌లు కట్టించడం, మంగలి వృత్తివారికి సెలూన్లు పెట్టుకోవడానికి సహాయపడటం లాంటి పను లు ప్రభుత్వం చేస్తున్నది. మాంస వ్యాపారం చేసే వారికి సంచార మాంస విక్రయ వాహనాలు
సమకూర్చింది.

పద్మశాలి కులస్థుల చేనేత వస్త్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేయడం వల్ల సిరిసాలగా ఉన్న సిరిసిల్ల ఉరిశాలైంది. తెలంగాణ వచ్చిన తర్వాత సిరిసిల్లలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ప్రారంభించటంతో వేల మందికి ఉపాధిలభించింది. పద్మశాలీల ఆత్మహత్యలు దూరమయ్యాయి. తెలంగాణలో వృత్తి పనులు లాభసాటిగా మారుతూ కడుపు నింపే పనులుగా మారేక్రమం బలపడుతున్నది. వృత్తిపనులు పారిశ్రామిక స్థాయికి చేరుకుంటున్నాయంటే అర్థం అందరూ కులవృత్తులు చేసుకొమ్మనికాదు. ఉన్న జీవనాన్ని ఉన్నతీకరించుకోవటం. గ్రామీణ వృత్తి పనులు లాభసాటిగా ఉండటం వల్ల గతకొన్నేండ్లుగా తెలంగాణలో ఉన్నత విద్యావంతులు కూడా గ్రామాల దిక్కు చూస్తున్నారు. కేసీఆర్‌ తెలంగాణలో తీసుకొస్తున్న వృత్తి విప్లవం ఫలితమే ఎన్నికలేవైనా టీఆర్‌ఎస్‌ అఖండ విజయం సాధిస్తున్నది. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నది.

డాక్టర్‌ కాలువ మల్లయ్య

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వృత్తి పారిశ్రామిక విప్లవం

ట్రెండింగ్‌

Advertisement