e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home ఎడిట్‌ పేజీ పల్లె జీవనగానం…

పల్లె జీవనగానం…

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా, ప్రత్యేకంగా జరుపుకొనే పండుగ బతుకమ్మ. తెలంగాణ ప్రజల ఆశలకు, యాసకు, భాషకు, మాండలికానికి బతుకమ్మ పాట వేదిక. ప్రకృతి శక్తిని ఆవిష్కరించే వేదిక బతుకమ్మ. భారతీయులంతా సంప్రదాయ పూజ పద్ధతిలో దేవుళ్లను పూలతో పూజిస్తారు. కానీ తెలంగాణ ప్రజలు పూవుల్లోనే దేవతను దర్శిస్తారు. ఇక్కడ పువ్వే దేవతారూపం పొంది బతుకమ్మ అయింది. మహాలయ అమావాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు జరుపుకొనే పండుగ బతుకమ్మ.

కొమ్మాల సంధ్య, 99087 63172

ఆడపడుచులంతా ఒక్కచోట…

- Advertisement -

బతుకమ్మ పండుగకు చాలా ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా ప్రజలు ప్రతి పండుగను వ్యక్తిగతంగా వారివారి ఇండ్లల్లో కుటుంబంతో కలిసి జరుపుకొంటారు. కానీ బతుకమ్మ మాత్రం ఆడపడుచులంతా ఒక్కచోట చేరి సామూహికంగా జరుపుకొంటారు. మహిళలు ఆడుతూ పాడుతూ జీవిత సారాన్ని వ్యక్తీకరిస్తారు. పాటల్లో కుటుంబ సంబంధిత విశేషాలు, ప్రకృతి ప్రకోపం, పిల్లలు, పెద్దల ముచ్చట్లు, తోటివారు సమాజం కోసం చేసిన త్యాగాలు, ఆడపడుచుల అలకలు, అన్నదమ్ముల ప్రేమ, తల్లిదండ్రుల అనురాగం, వదిన మరదల్ల విసుర్లు పాటల్లో ఉంటాయి.

డాక్టర్‌ ఎస్‌.నాగవాణి, 98669 42119

ప్రకృతిని ఆరాధించే పండుగ..

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ‘బతుకమ్మ’ను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తున్నది. దీంతో బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటి ప్రాధాన్యం మరింతగా పెరిగింది. తెలంగాణ పర్యాటకశాఖ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2018, అక్టోబర్‌ 19న ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించి బతుకమ్మ ఘనతను చాటారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించేకాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబురంగా జరుపుకోబడుతున్నది. ఈ సంబరాలు జరుపుకొనే వారంలో స్త్రీలు బొడ్డెమ్మ (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ)ను బతుకమ్మతో పాటూ నిమజ్జనం చేస్తారు.

గునుగుంట్ల శైలజ, 97052 22397

పుచ్చుకోవమ్మ వాయనం..

సాధారణంగా మనం పండుగలన్నీ చెడుపై మంచి సాధించే విజయాలకు గుర్తుగా జరుపుకొంటాం. దుష్టశిక్షణ కోసం దేవుడు ఎత్తే అవతారాలు పౌరాణిక గాథల నుంచి పండుగలు పుట్టుకొస్తాయి. ఇంకా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరువు కాటకాలు తాండవమాడినపుడు, అంటువ్యాధులు ప్రబలినపుడు వాటిని ఆయా దేవుళ్ల ఆగ్రహావేశాలుగా భావించి వాటికీ ఉపశాంతి కోసం పూజలు చేయడం కూడా పరిపాటి. ప్రాచీన కాలాల్లో మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగేది. స్త్రీని ఆశ్రయించుకునే కుటుంబవ్యవస్థ నడిచేది. పుట్టిన పిల్లలు మరణించకుండా చల్లగా బతుకు సాగించాలని ‘బతుకమ్మ’ అనే దేవతను సృష్టించుకున్నారు జానపదులు. ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో తమ జీవి తం సాగిస్తున్న పల్లె ప్రజలు, ఆ ప్రకృతిలోని పువ్వులతో ఈ పండుగను రూపొందించుకొని ఆనందిస్తున్నారు. బతుకమ్మను పండుగ అంటున్నప్పటికీ ఇది ఒక నోములాంటిదే. నోములలో వాయనాలిచ్చినట్లు ఈ పండుగలో కూడా వాయనాలిస్తారు. పూల మధ్యలో గౌరమ్మను పెట్టి కాంతలంతా నూటొక్క పూవుల, కోటి నోముల నోమీ అన్నట్లుగా గౌరీ మాతకు మంగళం పాడు తూ ఉండటంలో ఇది నోము వంటిది.

డాక్టర్‌ కందేపి రాణీప్రసాద్‌, 98661 60378

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement