e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home ఎడిట్‌ పేజీ విశ్వనరుడను నేను

విశ్వనరుడను నేను

కులమతాలు గీచుకున్న గీతలను జొచ్చి
పంజరాన కట్టువడను నేను
నఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు
తిరుగులేదు విశ్వనరుడను నేను

పూదోటల మద భంభంర నాదముల
నడబెడుగల నాహ్లాదించు కవులకీ
నిరుపేదల ఆక్రందనములు
వీనులబడునా!

- Advertisement -

పామునకు బాలు, చీమకు బంచదార
మేపుకొనుచున్న కర్మభూమి జనించు
ప్రాక్తనంబైన ధర్మదేవతకు గూడ
నులికిపడు జబ్బు గలదు వీడున్న చోట

రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొక తార గగన మెక్కె
రాజు జీవించె రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement