e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021

అమ్మనై..

బీజమై భూమిలో నాటితే
భూజమై నేనెదగనా..
భూమి నుంచి జనించినది మొదలు
మానవ మనుగడకు భూమికను కానా..
వేళ్లూనిన వృక్షాన్నై విస్తరించి
వెచ్ఛని కిరణాలతో నిన్నూ
వాతావరణ సమతుల్యాన్నీ
కాపాడేది నేనేగా!
మెతుకునై నిన్ను చేరేవరకు
ఎన్ని దశలు మారెనో..
ఒక పండునై నీ ఆకలి తీర్చేందుకు
ఎన్ని గండాలు దాటి చేరెనో
బతికినంతకాలం
పరుల సేవ కొరకే జీవించే
ఉన్నచోటే నిల్చొని ఉనికిని గాచే
పచ్చని సైనికులం..!
ఒక్కో అవయవాన్ని
ఒక్కోరకంగా మీ కోసం
దానమిచ్చే త్యాగధనులం
మనిషి స్వార్థం మీరి
వనాలన్నీ చెరిపేస్తుంటే
మరో ప్రళయమే అవతరించునేమో..
మానవ మనుగడకు
ముప్పు వాటిళ్లకముందే
మేలుకో ఓ నరుడా
మేలు కోరి చెప్పుమాట
మెలకువగా మసలుకో
అడుగడుగున చెట్లు నాటి
ఆపదలను ఎదురుకో
అమ్మలాంటి చెట్టును నేను
ఆకలి తీర్చే అమ్మను నేను..!

రాపోలు అరుణాస్వామి
83282 77215

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement